విద్యుత్ సరఫరా ప్రారంభం..

విద్యుత్ సరఫరా ప్రారంభం..

ముంతా తుఫాన్ కారణంగా పడిపోయిన విద్యుత్ స్తంభాల పునరుద్ధరించిన విద్యుత్ శాఖ అధికారులు

కోడూరు – ఆంధ్రప్రభ : గత ఏడాది సంభవించిన ముంతా తుఫాన్ కారణంగా వీచిన భారీ గాలులకు కోడూరు మండల పరిధిలోని జరుగువానిపాలెం నుండి మందపాకల వెళ్లే 33కకె వి విద్యుత్ లైన్ స్తంభాలు పడిపోయాయి.
గత నెల రోజులుగా విద్యుత్ శాఖ అధికారులు పడిపోయిన విద్యుత్ స్తంభాల ప్రదేశంలో నూతన విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేయడంతోపాటు కొన్నిచోట్ల విద్యుత్ స్తంభాలను పునరుద్ధరించారు. వేగవంతంగా పనులను నిర్వహించారు.
శనివారం నాడు విద్యుత్ సరఫరాను ప్రారంభించారు. అవనిగడ్డ విద్యుత్ శాఖ ఏడిఏ సుబ్రహ్మణ్యేశ్వర రావు విద్యుత్ సరఫరాను ప్రారంభించారు. విద్యుత్ శాఖ కోడూరు ఏఈ గోపీచంద్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply