హమాలి కార్మికులకు చల్లటి ఫిల్టర్ వాటర్ సరఫరా

జుక్కల్ (కామారెడ్డి), ఆంధ్రప్రభ : మేడేను పురస్కరించుకుని మొహ్మదాబాద్ గ్రామ సర్పంచ్ సుర్నర్ శకుంతల బాలుసార్ హమాలి కార్మికులకు 20 డబ్బాల చల్లటి ఫిల్టర్ వాటర్ త్రాగటానికి పంపిణీ చేశారు.సింగిల్ విండో ద్వారా గ్రామ శివర్లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రం కొనసాగుతుంది.ఈ కేంద్రంలో వరి తూకం చేసేందుకు పదుల సంఖ్యలో కార్మికులు ప్రతిరోజు హమాలిపని నిర్వహిస్తున్నారు.
వరి ధాన్యం కొనుగోలు ముగింపు వరకు ప్రతిరోజు 20 డబ్బల చొప్పున ఫిల్టర్ మంచినీటిని కార్మికుల దాహం తీర్చేందుకు సరఫరా చేయటం జరుగుతుందని సర్పంచ్ సుర్నర్ శకుంతల తెలిపారు.హమాలీలకు,రైతులకు మంచినీటి సరఫరా చేయటంపై గ్రామస్తులు కూడా హర్షం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా ఉపసర్పంచ్ పోతుల లక్ష్మణ్,కార్యదర్శి ఎన్ జీవన్,వార్డుస భ్యులు,విండో ఉద్యోగి రాకేష్ గౌడ్,గ్రామపెద్దలు పాల్గొన్నారు.
