మహిళ డెఫ్ క్రికెట్ క్రీడాకారిణులను అభినందించిన శాప్ చైర్మన్ రవి నాయుడు

మహిళ డెఫ్ క్రికెట్ క్రీడాకారిణులను అభినందించిన శాప్ చైర్మన్ రవి నాయుడు
ఆంధ్రప్రభ, విజయవాడ : హర్యానాలో మార్చి 23 నుండి 27, 2026 వరకు నిర్వహించిన జాతీయ స్థాయి డెఫ్ టి 10 క్రికెట్ ఛాంపియన్‌షిప్‌లో ఆంధ్రప్రదేశ్ మహిళల డెఫ్ క్రికెట్ జట్టు అద్భుత విజయాన్ని సాధించింది. మొత్తం 9 జట్లు పాల్గొన్న ఈ పోటీలో, ఫైనల్ మ్యాచ్‌లో ఢిల్లీ జట్టును ఓడించి ఆంధ్రప్రదేశ్ జట్టు విజేతగా నిలిచింది. ఈ సందర్భంగా, విజయవాడలోని శాప్ ప్రధాన కార్యాలయంలో శాప్ చైర్మన్ రవి నాయుడు విజేతలైన ఆంధ్రప్రదేశ్ మహిళా డెఫ్ క్రికెట్ జట్టు సభ్యులను అభినందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, జట్టు సభ్యుల కృషి, పట్టుదల మరియు అంకితభావం ప్రశంసనీయమని తెలిపారు.
ఇంకా రానున్న రోజుల్లో జాతీయ మరియు అంతర్జాతీయ స్థాయిల్లో మరింత ప్రతిభ కనబరిచి, రాష్ట్రానికి, దేశానికి మరిన్ని పతకాలు సాధించి కీర్తి తీసుకురావాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ బ్లైండ్ క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి జి. రవీంద్రబాబు, అర్జున అవార్డు గ్రహీత ఐ. అజయ్ కుమార్ రెడ్డి, జనరల్ సెక్రటరీ రఘు తదితరులు పాల్గొన్నారు.

