స్థానిక ఎన్నికలే లక్ష్యం.. పార్టీ శ్రేణులు సమన్వయంతో పనిచేయాలి

స్థానిక ఎన్నికలే లక్ష్యం.. పార్టీ శ్రేణులు సమన్వయంతో పనిచేయాలి

పెడన (ఆంధ్రప్రభ): పెడన తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మండల స్థాయి నాయకులు, క్లస్టర్ మరియు యూనిట్ ఇన్‌చార్జులు, బీఎల్ఏల నియోజకవర్గ స్థాయి సమీక్షా సమావేశంలో పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రానున్న స్థానిక సంస్థల ఎన్నికలు అత్యంత కీలకమైనవని, ప్రతి ఓటు పార్టీ విజయానికి పునాదిగా నిలుస్తుందని అన్నారు. బూత్ స్థాయి ఏజెంట్లు, సర్ బృందాలు, యూనిట్ ఇన్‌చార్జులు, పార్టీ కార్యకర్తలతో కలిసి ఓటర్ మ్యాపింగ్, పార్టీ సంస్థాగత బలోపేతంపై సమీక్ష నిర్వహించారు.

కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించాలని కార్యకర్తలకు సూచించారు. అలాగే పార్టీ శ్రేణులంతా ‘మై టీడీపీ’ యాప్‌ను సమర్థవంతంగా వినియోగించుకోవాలని కోరారు.

Leave a Reply