వేసవికాలంలో పిల్లల పట్ల తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలి

వేసవికాలంలో పిల్లల పట్ల తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలి
– నందికొట్కూర్ పట్టణ సీఐ అశోక్ కుమార్
నందికొట్కూర్ , ఆంధ్రప్రభ: వేసవికాలపు సెలవులు ప్రారంభమైన నేపథ్యంలో చిన్నపిల్లలు ఈత కోసం కాల్వలు, కుంటలు, చెరువులు, నదుల వద్దకు వెళ్లి ప్రమాదాలకు గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తల్లిదండ్రులు పిల్లల పట్ల జాగ్రత్తగా ఉండాలని నందికొట్కూర్ అర్బన్ సీఐ అశోక్ కుమార్ సోమవారం తెలిపారు. ఈ సందర్భంగా అర్బన్ సీఐ అశోక్ కుమార్ మాట్లాడుతూ ప్రత్యేకంగా గ్రామాలు, పల్లెల్లో , పట్టణ శివారు ప్రాంతాల్లో ఉన్న కాల్వలు, కల్వర్టులు, చెరువులు , నదులలో అకస్మాత్తుగా జారిపడే ప్రమాదం ఉండటం వల్ల చిన్నపిల్లలు ప్రాణాపాయ పరిస్థితుల్లో పడుతున్న ఘటనలు ప్రతి సంవత్సరం చోటు చేసుకుంటున్నాయన్నారు. నందికొట్కూరు పరిధిలో ఉన్న పిల్లల తల్లిదండ్రులకు పలు సూచనలు చేశారు.
చిన్నపిల్లలను ఒంటరిగా బయటకు వెళ్లనీయవద్దు అని ఆయన తెలిపారు కాల్వలు, కుంటలు, చెరువులు, నదుల దగ్గరకు వెళ్లకుండా తల్లిదండ్రులు పర్యవేక్షించాలి అని అన్నారు.ఈత రాని పిల్లలు నీటి కుంటల దగ్గరికి వెళ్లకుండా ఖచ్చితంగా నియంత్రించాలి తల్లిదండ్రులకు సూచించారు. లోతైన ప్రాంతాలను గుర్తించి పిల్లలు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలి అని చెప్పారు ఏదైనా ప్రమాదం జరిగితే వెంటనే స్థానిక పోలీసులకు గాని, డయల్ 112 కు గాని లేదా డయల్ 100 కు గాని సమాచారం ఇవ్వాలి.వేసవికాలంలో తల్లిదండ్రులు పిల్లల పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని మరోసారి విజ్ఞప్తి చేశారు.
