సివిల్స్ లో సత్తా చాటిన హర్షిత మేదరకు ఆత్మీయసత్కారం

సివిల్స్ లో సత్తా చాటిన హర్షిత మేదరకు ఆత్మీయసత్కారం

భవానిపురం, ఆంధ్రప్రభ: సివిల్ సర్వీస్ పరీక్షల్లో జాతీయస్థాయి 520వ ర్యాంకు సాధించిన హర్షితను (విజయవాడ ట్రాఫిక్ విభాగంలో పనిచేస్తున్న మేధర సుధాకర్ కుమార్తె ) గాంధీజీ నగరపాలక కళాశాల 1988- 1989 బ్యాచ్ వెల్ఫేర్ అసోసియేషన్ వారు సోమవారం విజయవాడ గణపతి రావు రోడ్ ఏఎస్ గ్రాండ్ ఫంక్షన్ హాల్లో ఘనంగా సన్మానించుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… హర్షిత విద్యాభ్యాసం అంతా విజయవాడలోనే కొనసాగిందని ఆమె తల్లి చంద్ర లీల గృహిణి అని, 2021లో బీటెక్ పూర్తి (కంప్యూటర్ సైన్స్) పూర్తి చేసిన హర్షిత తల్లితండ్రుల ప్రోత్సాహంతో సివిల్స్ పై దృష్టి సారించి నాలుగవ ప్రయత్నంలో విజయం సాధించిందని అన్నారు.

అనంతరం ఆమెను శాలువాతో,పూల బొకేతో సన్మానించినారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వైసీపీమైనారిటీ కార్యదర్శి బాజీ బాబా పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమ నిర్వాహకులు కళాశాల పూర్వ విద్యార్థుల సంఘం అధ్యక్షులు కుమార్ స్వామి, సెక్రటరీ సతీష్ కుమార్,ఎస్.కె కాజా, మధు తిలక్రాం సింగ్, సయ్యద్ అబ్దుల్ ఖాదర్ ,హరి పాషా చంద్ర నయర్ బాషా నాగరాజు ,వానపల్లి కృష్ణారావు ,అప్పారావు ,అక్బర్, మళ్లీ దేవేంద్ర ,అంజద్ భాషా ,కాజా షబ్బీర్ అలీ అన్వర్, ఆదిల్, షావుకారు ,సయ్యద్ అబ్దుల్ నాజర్ శుభాకాంక్షలు తెలిపారు.

Leave a Reply