శ్రీశైలం ముంపు బాధితులు 33 రోజులుగా దీక్షలు

శ్రీశైలం ముంపు బాధితులు 33 రోజులుగా దీక్షలు

నందికొట్కూర్ , ఆంధ్రప్రభ: రాయలసీమలో ఎమ్మెల్యే స్థాయి నుండి ముఖ్యమంత్రుల స్థాయికి ఎదిగినా రాయలసీమ ప్రజలకు ఇచ్చిన హామీల అమలులో జ్యాప్యం ఎందుకు చేస్తున్నారు. అని తమ ఉద్యోగ కల్పన జీవో 98 హామి అమలు చెయ్యక పోవడం తీవ్ర అన్యాయమని శ్రీశైలం ముంపు భాదితులు 33 రోజులుగా దీక్షలు చేస్తున్న పాలకులు పట్టించుకోవడం లేదని ముంపు భాదితులు తమగోడు వెళ్ళబుచ్చారు. కూటమిలోని ముగ్గురు నాయకులు ముఖ్యమంత్రి లోకేష్ పవన్ కల్యాణ్ హామి లక్షలాది మంది మధ్య నందికొట్కూర్ నడిబొడ్డున హామి ఇచ్చి అధికారంలోకి వచ్చాక తమ వైపు కన్నెత్తి కూడా చూడటం లేదని ఇది ఎంత అన్యాయమో మీరే ఆలోచించండి. అని పాలకులను ప్రశ్నించారు.

రాష్ట్ర అభివృద్ధికి తాము సర్వం త్యాగం చేశామని మమ్మల్ని నడిరోడ్లపై పడేయడం సమంజసమా అని ముంపు భాదితులు నెహ్రూనగర్ జయన్న భాదపడ్డారు. మేము గొంతెమ్మ కోర్కెలు కోరడం లేదని ఎన్నో సంవత్సరాలుగా హామిలిస్తు వస్తున్న ఔట్ సోర్సింగ్ రిటైర్డ్ లస్కర్ ఖాళీలలో భర్తి చేసి ఉపాధి చూపమని అడుగుతున్నామని పాలకులు దీనిని కూడా ఆలస్యం చేస్తూ మాకు తీవ్ర అన్యాయం చేస్తున్నారని ముంపు భాదితులు కన్నీరు పెట్టారు. రాష్ట్ర ఆధాయం గణనీయంగా అభివృద్దిని ఇస్తున్న శ్రీశైలం ప్రాజెక్ట కొరకు ఆస్థులు పొలాలు ఇల్లు త్యాగం చేసిన వారమని ఇది ఆర్ధిక భూచి చూపిస్తు మమ్మల్ని మరింత క్షోభకు గురిచేస్తున్నరని ప్రభుత్వం చేసే దుబార ఖర్చుల కన్న మాకిచ్చే జీతాలు చాలా తక్కువ అని ప్రభుత్వ పాలకులు మాకిచ్చే జీవనోపాది వైపు చూడాలని ఇప్పటికే జీవనభృతి లేక 32 మంది ఆత్మహత్య చేసుకొని చనిపోయారని వారి కుటుంబాలు ఎలా బతకాలో ప్రభుత్వ పాలకులు చెప్పాలని ముంపు భాదితులు కన్నీరు పెట్టారు.

ప్రభుత్వం అనేక లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెబుతున్నారని ఆ ఉద్యోగాలలో మా ఉద్యోగాలు కొన్ని మాత్రమేనని రెండు సం పాలనాపూర్తయిన 674 ఉద్యోగాలు కూడా ఇవ్వకపోవడం శోచనీయమని ముంపు భాదితులు నెహ్రూనగర్ జయన్న కన్నీటిపర్యంతమయ్యారు. ఇప్పటికైనా ప్రభుత్వం తక్షణమే స్పందించాలని నీటి పారుదల శాఖామంత్రి ఇవాఖలో ఎటువంటి జీవోలేని ప్రాంతవాసులకు నోటిఫికేషన్ లేకుండా 1085 లస్కర్ ఉద్యోగాలు భర్తి చెయ్యడం అందులో 50% కోటా క్రింద సగం ఉద్యోగాలు జీవో 98 భాదితులు అయిన శ్రీశైలం ముంపు భాదితులకు ఇవ్వాలని తెలియదా అని ముంపు భాదితులు ప్రశ్నించారు. ఉద్యోగాలు ఇచ్చేవరకు మీరిచ్చిన హామి నెరవేర్చే వరకు దీక్షలు విరమించబోమని ఆవసరమైతే ఆమరణ నిరాహార దీక్షలు చేస్తామని శ్రీశైలం ముంపు భాదితులు పేర్కొన్నారు. ఈ దీక్షలో జిరాక్స్ రాజు, నాగేంద్రుడు జయన్న ‘మురళి, చాంద్ భాషా, శైలజ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply