పెట్రోల్, డీజిల్ కొరత లేదు

పెట్రోల్, డీజిల్ కొరత లేదు

  • జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి

కర్నూలు బ్యూరో, ఆంధ్రప్రభ: పెట్రోల్, డీజిల్ కొరత లేదు, వాహనదారులు ఆందోళన చెంది అవసరానికి మించి కొనుగోలు చేయొద్దని జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి వాహనదారులకు సూచించారు. సోమవారం స్థానిక భూపాల్ కాంప్లెక్స్ ఎదురుగా ఉన్న నారాయణమూర్తి పెట్రోల్ బంక్ , అమ్మ హాస్పిటల్ వద్ద ఉన్న రిలయన్స్ పెట్రోల్ బంక్, గుత్తి పెట్రోల్ బంక్ ను కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేశారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో మొత్తం 166 పెట్రోల్ బంక్ లు ఉన్నాయన్నారు. ప్రతి పెట్రోల్ పాయింట్ వద్ద విఆర్ఓ లు ఉండి పెట్రోల్ లోడ్ ఎంత వస్తుందనే వివరాలను ఖచ్చితంగా పర్యవేక్షణ చేస్తున్నారని తెలిపారు. క్యాన్ లు, డబ్బాలు, బ్యారెల్స్ తీసుకొని వస్తే పెట్రోల్ వేయొద్దని కలెక్టర్ షాప్ యాజమాన్యం వారిని ఆదేశించారు. గత 3 రోజుల నుండి చూస్తే ఇప్పుడు కొంచెం జన సమూహం తగ్గిందన్నారు. ఇప్పటి వరకు 15 కేసులు బుక్ చేశామని, 150 లీటరు డీజిల్, 200 లీటర్ల పెట్రోల్ ను సీజ్ చేయడం జరిగిందన్నారు.

HPCL, తదితర ఆయిల్ కంపెనీలతో మాట్లాడం జరిగిందని సాయంత్రం నాటికి 95 నుండి 100 వరకు లోడ్ రావడం జరుగుతుందన్నారు. తద్వారా పరిస్థితి అదుపులోకి వస్తుందన్నారు. అనంతరం కలెక్టర్ అక్కడే ఉన్న వాహనదారులతో మాట్లాడుతూ పెట్రోల్, డీజిల్ కొరత లేదని, ఆందోళన పడి అవసరానికి మించి కొనుగోలు చేయొద్దన్నారు. ఇటువంటి సమయంలో వాహనదారులు కూడా అధికారులకు సహకరించాలని కలెక్టర్ వాహనదారులకు సూచించారు. జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ పెట్రోల్ బంక్ ల వద్ద జనాన్ని లేదా క్యూ ను నియంత్రించడానికి అవసరమైన పోలీస్ సిబ్బందిని ఇప్పటికే ఏర్పాటు చేశామన్నారు. కార్యక్రమంలో డిఎస్ఓ రాజా రఘువీర్, సివిల్ సప్లైస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply