265MedicalCamps | అంకెల్లోనే కాదు.. అభివృద్ధిలోనూ ముందుకు

265MedicalCamps | అంకెల్లోనే కాదు.. అభివృద్ధిలోనూ ముందుకు

265MedicalCamps | కలెక్టర్ల సమీక్ష అనంతరం అభివృద్ధి పనులకు ఊపు
భూగర్భ జలాల పెరుగుదలతో నీటి సంరక్షణకు ప్రాధాన్యం
చెరువుల పునరుద్ధరణ, వర్షపు నీటి నిర్మాణాల ఏర్పాటు
రోడ్లు, డ్రైనేజీ, తాగునీటి సదుపాయాల విస్తరణ
ఎల్‌ఈడి వీధి దీపాలతో ఆధునీకరణ చర్యలు
ఆసుపత్రులకు ఆధునిక పరికరాలు, గ్రామీణ వైద్య శిబిరాలు
సాంకేతిక పర్యవేక్షణతో అభివృద్ధి పనుల ట్రాకింగ్
అసంపూర్తి పనులపై వ్యక్తమవుతున్న ఆందోళనలు

265MedicalCamps | కర్నూలు, ఆంధ్రప్రభ బ్యూరో : ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్వహించిన కలెక్టర్ల సమీక్ష అనంతరం కర్నూలు జిల్లాలో అభివృద్ధి కార్యక్రమాలు వేగం పుంజుకున్నాయి. లక్ష్యాల ఆధారిత అమలు, క్రమబద్ధమైన పర్యవేక్షణ, సాంకేతిక వినియోగంతో జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎ. సిరి, యావత్‌ యంత్రాంగం పలు రంగాల్లో పురోగతి సాధించినట్లు- అధికార వర్గాలు వెల్లడించాయి. అయితే అంకెల్లో కనిపిస్తున్న పురోగతి భూమిపై పూర్తిస్థాయిలో ప్రతిఫలించాలంటే మరింత కృషి అవసరమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. జిల్లాలో భూగర్భ జలాల స్థాయి 6.2 మీటర్ల నుంచి 7.4 మీటర్లకు పెరిగింది.

చెరువుల పునరుద్ధరణకు ప్రాధాన్యం ఇచ్చి 210 చెరువులను అభివృద్ధి చేయగా, 3,850 వర్షపు నీటి సంరక్షణ నిర్మాణాలు ఏర్పాటు చేశారు. ఈ పనులపై సుమారు రూ.42 కోట్లు- వ్యయం చేసినట్లు అధికారులు తెలిపారు. రహదారులు, డ్రైనేజీ, తాగునీటి సదుపాయాల మెరుగుదలపై ప్రత్యేక దృష్టి సారించారు. జిల్లాలో 112 కిలోమీటర్ల సీసీ రోడ్లు నిర్మించగా, 58 కిలోమీటర్ల డ్రైనేజీ లైన్లు, 41 కిలోమీటర్ల తాగునీటి పైపులైన్లు ఏర్పాటు చేశారు. వీటిపై వరుసగా రూ.68 కోట్లు-, రూ.34 కోట్లు-, రూ.27 కోట్లు- ఖర్చు చేశారు.

వీధి దీపాల ఆధునీకరణలో భాగంగా 12,500 ఎల్‌ఈడి లైట్లు- ఏర్పాటు- చేసి రూ.9 కోట్లు- వ్యయం చేశారు. అయితే కొన్ని ప్రాంతాల్లో పనులు ఇంకా అసంపూర్తిగా ఉండటం గమనార్హం.పభుత్వ ఆసుపత్రులకు రూ.18 కోట్ల విలువైన ఆధునిక పరికరాలు అందించారు. గ్రామీణ ప్రాంతాల్లో 265 వైద్య శిబిరాలు నిర్వహించారు. పారిశుద్ధ్య పనులకు రూ.బి22 కోట్లు ఖర్చు చేశారు. అభివృద్ధి పనుల పర్యవేక్షణలో సాంకేతికత వినియోగం పెరిగింది. ప్రతి పనికి జియోట్యాగింగ్‌, ఆన్‌లైన్‌ డాష్‌బోర్డ్‌ ద్వారా ప్రగతి ట్రాకింగ్‌, రియల్‌-టైమ్‌ ఫోటో అప్‌డేట్లతో పనులపై పర్యవేక్షణ బలోపేతం చేశారు.

CLICK HERE TO READ మోడల్‌ జిల్లాగా కడప

CLICK HERE TO READ MORE

Leave a Reply