ప్రజల ఫిర్యాదులను నాణ్యతతో, వేగవంతంగా పరిష్కరించండి

ప్రజల ఫిర్యాదులను నాణ్యతతో, వేగవంతంగా పరిష్కరించండి
- జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి
కర్నూలు, ఆంధ్రప్రభ: ప్రజా ఫిర్యాదులను నాణ్యతతో, వేగవంతంగా పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సునయన ఆడిటోరియంలో “ప్రజా సమస్యల పరిష్కార వేదిక” (పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెసెల్ సిస్టమ్ – పిజిఆర్ఎస్) కార్యక్రమంలో భాగంగా కలెక్టర్ ప్రజల నుండి సమస్యల వినతులను స్వీకరించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ… ప్రజా ఫిర్యాదులపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించి, ప్రతి దరఖాస్తును పరిశీలించి పెండింగ్ లేకుండా గడువు లోపు పరిష్కరించాలన్నారు. ఎట్ టూ వ్యూ లో ఒక్క అర్జీ కూడా ఉండకూడదన్నారు. అధికారుల లాగిన్ లోకి వచ్చిన అర్జీలను ఎప్పటికప్పుడు చూడాలన్నారు. 1100 కాల్ సెంటర్ ద్వారా సిటిజన్ ఫీడ్ బ్యాక్ తీసుకుంటున్నారని, ఫీడ్ బ్యాక్ ద్వారా సంతృప్తి వ్యక్తపరిచేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.. అర్జీదారులకు అందజేసే ఎండార్స్‌మెంట్లు స్పష్టంగా ఉండాలని కలెక్టర్ పేర్కొన్నారు. రీ-ఓపెన్ అయిన అర్జీలపై ప్రత్యేక పర్యవేక్షణ ఉండాలని, అవి మళ్లీ పెండింగ్‌లో పడకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.
కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్, ఇంచార్జి డి ఆర్ ఓ చిరంజీవి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ లు అనురాధ, కొండయ్య, సునీత, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.
