అనంతలో 26న బీసీ గళం
అనంతలో 26న బీసీ గళం
- మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి
రాప్తాడు, ఆంధ్రప్రభ: ఈ నెల 26న అనంతపురంలోని లలిత కళాపరిషత్ లో నిర్వహిస్తున్న బీసీ గళం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని రాప్తాడు నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం వైసీపీ క్యాంపు కార్యాలయం నందు బీసీ గళం పోస్టర్లను విడుదల చేశారు.
ఈ సంధర్భంగా మాట్లాడుతూ.. నియోజకవర్గం నలుమూలల నుంచి బీసీ సోదరులు ప్రజలు వైఎస్సార్‌సీపీ నాయకులు, ఎంపీపీలు, జెడ్పీటీసీ సభ్యులు, వైస్ ఎంపీపీలు కన్వీనర్లు, ఎంపీటీసీ సభ్యులు, మాజీ సర్పంచ్‌లు అనుబంధ సంఘాల నాయకులు కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో 6 మండలాల కన్వీనర్లు కార్యదర్శులు కార్యకర్తలు పాల్గొన్నారు.
