రైతులు ప్రకృతి వ్యవసాయం చేయండి

రైతులు ప్రకృతి వ్యవసాయం చేయండి

రాప్తాడు, ఆంధ్రప్రభ: ఎల్ నినో ప్రభావం వలన వర్షాభావ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉన్నందువలన వర్షాబావ పరిస్థితులను తట్టుకునే విధంగా ప్రకృతి వ్యవసాయం ద్వారా పంటలు పండించాలని అనంతపురం ఏడిఏ (ఎఫ్ఏసి) వెంకట్ కుమార్ తెలియజేశారు. శుక్రవారం రాప్తాడు మండల పరిధిలోని హాంపాపురం గ్రామం నందు ఆర్.ఎస్.కె, ఏపీ సీఎన్ఎఫ్ సిబ్బందికి ప్రకృతి వ్యవసాయ సాగు విధానాలపైరాప్తాడు వ్యవసాయ శాఖ అధికారి కృష్ణ చైతన్య ఆధ్వర్యంలో శిక్షణా తరగతులను నిర్వహించారు.
ఈ సందర్భంగా ఏడిఏ వెంకట్ కుమార్ మాట్లాడుతూ… ప్రకృతి వ్యవసాయ సాగు విధానంలో మూడు రకాల పద్ధతులను రైతులు పాటిస్తే మేలని తెలిపారు. పిఎండిఎస్ అర్థచంద్రాకారం పద్ధతిలో వ్యవసాయం నుంచి ఫలసాయ పంటలను సాగు చేయవచ్చు. పీఎండిఎస్ రుతు పవనాల కంటే ముందు గానే విత్తనాలను భూమిలో చల్లడం లేదా గొర్రుతో విత్తనం వేయడం ద్వారా వర్షం వచ్చినప్పుడు అవి మొలకెత్తే అవకాశం ఉందన్నారు.

ఈ పద్ధతిలో సాగు చేసే ప్రధాన పంటలు ఆముదం జొన్న సద్ద కంది పెసలు మినుములు అలసంద లాంటి పంటలను సాగు చేసే అవకాశం ఉందన్నారు. విత్తనాలను బంకమట్టితో గుళికలుగా తయారు చేసి భూమిలో విత్తు కొనడం ద్వారా నీటి ఎద్దడిని తట్టుకొని దిగుబడి సాధించే అవకాశం ఉందన్నారు.అర్ధ చంద్రకారం సాగు పద్ధతిలో వాలుగా ఉన్న నేలల్లో వాలుకు అడ్డంగా దున్నడం ద్వారా నీటిని భూమిలోకి ఇంకింప చేసే అవకాశం ఉందని తెలిపారు.

వాలుకు అడ్డంగా కందకాలు తయారు చేసి ఆ కందకాలలో విత్తనాలను వేసి సాగు చేసే పద్ధతి దీని ద్వారా భూమి క్షయాన్ని మరియు నీటి వృధాను అరికట్టి పంటలకు తేమను నిల్వ చేసి నీటి ఎద్దడిని తట్టుకునే అవకాశం ఉందని తెలిపారు. వ్యవసాయం నుంచి ఫలసాయ పంటల సాగు రైతుకు ఆదాయాన్ని పెంచే విధంగా పండ్లతోటల పెంపకాలను ప్రోత్సహించడం అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఈవోలు రంజిత, సుజిత, విఎఎ గిరిబాబు, విహెచ్ఎ సోనియా, ప్రకృతి వ్యవసాయం సిబ్బంది రైతు సేవ కేంద్రం సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply