బాయన కనకారావు కుటుంబానికి ఆర్థిక సాయం

బాయన కనకారావు కుటుంబానికి ఆర్థిక సాయం
భవానిపురం, ఆంధ్రప్రభ: ఇటీవల మరణించిన 51 వ డివిజన్ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు బాయన కనకారావు కుటుంబానికి జాతీయ టిడిపి ఉపాధ్యక్షులు బుద్ధా వెంకన్న శుక్రవారం రూ. 20,000 ఆర్థిక సహాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ ఉమ్మడి వెంకటేశ్వరరావు, నగరాల కార్పొరేషన్ డైరెక్టర్ సుఖాసి కిరణ్, దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానం ట్రస్ట్ బోర్డ్ సభ్యురాలు సుఖాసి సరిత, బంక నాగమణి, 52వ డివిజన్ అధ్యక్షులు ఈగల సాంబ, 51 వ డివిజన్ అధ్యక్షులు కుంచం దుర్గారావు, వడ్డీ శంకర్, తదితరులు పాల్గొన్నారు.
