సర్కిల్ వన్ మొబైల్ కోర్టులో 14 కేసులు

సర్కిల్ వన్ మొబైల్ కోర్టులో 14 కేసులు
-రూ 2940 అపరాధ రుసుం వసూలు
చిట్టినగర్, ఆంధ్రప్రభ: విజయవాడ నగరం చెత్త రహితంగా ఉండాలని నగరపాలక సంస్థ ఉన్నతాధికారులు పని చేస్తున్నప్పటికీ కొంతమంది బాధ్యతారాహిత్యంగా రోడ్ల మీద చెత్తాచెదారం చేస్తున్నారు. అలాగే పశువుల వదిలవద్దని చెబుతున్నా కొంతమంది వాటిని పాటించడం లేదు. విజయవాడ నగరంలో రోడ్ల మీద చెత్తాచెదారం వేయడం, రోడ్ల మీద పశువులను వదిలిన లైసెన్స్ లేకుండా వ్యాపార చేయడం మున్సిపల్ కార్పొరేషన్ యాక్ట్ 1955 ప్రకారం నేరం. దాంతో విజయవాడ నగర పాలక సంస్థ శానిటరీ ఇన్స్పెక్టర్ లు వారి పై సమరీ ట్రాయల్ కేసు లు నమోదు చేస్తుంటారు. అలాంటి కేసులు పరిష్కరించడానికి విజయవాడ నగర పరిధిలో ఉన్న సర్కిల్ కార్యాలయంలో నెలకొకసారి మొబైల్ కోర్టు నిర్వహిస్తున్నారు.
విజయవాడ నగరపాలక సంస్థ సర్కిల్ వన్ కార్యాలయం లో శుక్రవారం ఉదయం 8 వ అడిషనల్ జ్యూడిషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ గోలి లెనిన్ బాబు మొబైల్ కోర్టు ను నిర్వహించారు. సర్కిల్ వన్ కార్యాలయం పరిధిలో ఉన్న శానిటరీ ఇన్స్పెక్టర్ లు 14 మంది పై సమరీ ట్రైయిల్ కేసులు నమోదు చేశారు. వాటిలో రోడ్ల పై చెత్తాచెదారం వేయడం లాంటివి ఉన్నాయి. ఇలా నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న వారి ని మొబైల్ కోర్టు లో ప్రవేశ పెట్టేరు. మున్సిపల్ కార్పొరేషన్ సర్కిల్ వన్ కార్యాలయం పరిధిలో రోడ్ల పై చెత్తాచెదారం వేసిన వారికి 210 రూపాయలు చొప్పున 14 మందికి జరిమానా విధించారు.
ఈరోజు మొబైల్ కోర్టు లో 14 మంది నుండి 2940 రూపాయలు అపరాధ రుసుం వసూలు చేశారు. ఈ కార్యక్రమం లో ఏ.ఎం.హెచ్ ఓ డాక్టర్ అన్నపూర్ణ, శానిటరీ సూపర్వైజర్ లు డి.సోమరాజు, ఎస్.వి.ఎస్ శ్రీధర్, శానిటరీ ఇన్స్పెక్టర్లు జి. దుర్గారావు, శామ్యూల్, ఆనంద్ కృపాల్, వి. శ్రీనివాసరావు, ఆదినారాయణ పి.రమేష్ బాబు, కె. కృష్ణ, తదితరులు పాల్గొన్నారు.
