డీసెల్టింగ్ పనులు పూర్తి స్థాయిలో చేయాలి

డీసెల్టింగ్ పనులు పూర్తి స్థాయిలో చేయాలి
- కమిషనర్ ధ్యాన చంద్ర
విజయవాడ, ఆంధ్ర ప్రభ: విజయవాడ నగరంలో డీసెల్టింగ్ పనులను పూర్తి స్థాయిలో చేయాలని విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు. శుక్రవారం ఉదయం తన పర్యటనలో భాగంగా సివిఆర్ ఫ్లైఓవర్, మిల్క్ ప్రాజెక్ట్, హెచ్బీ కాలనీ, ఆర్టీసీ వర్క్ షాప్ రోడ్, పున్నమిఘాట్ ప్రాంతాలన్నీ పర్యటించి క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. ముందుగా సివిఆర్ ఫ్లై ఓవర్ వద్ధ ఉన్న మేజర్ ఔట్ ఫాల్ డ్రైన్ ను క్షేత్ర స్థాయి లో పరిశీలించి, అక్కడ ఎక్సలేటర్ ద్వారా డీసిల్టింగ్ పనులను శరవేగంగా చేయాలని అన్నారు.
నగరంలో కూడా వాహనాల సంఖ్యను పెంచి, డిసిల్టింగ్ ప్రక్రియను పూర్తి చేయాలని అన్నారు. తదుపరి హెచ్ బి కాలనీలో ఉన్న విఎంసి స్కేటింగ్ ప్రాంగణాన్ని పరిశీలించారు. స్కేటింగ్ కోసం వచ్చే చిన్నారులకు పూర్తిస్థాయిలో వసతులు కల్పించాలని, మెరుగైన సౌకర్యాలు వారికి అందించే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని అన్నారు. తదుపరి ఆర్టీసీ వర్క్ షాప్ రోడ్ లో ఉన్న అన్నా క్యాంటీన్ ను క్షేత్రస్థాయిలో పరిశీలించారు త్రాగునీటి సరఫరా ఆహారంలో నాణ్యత పారిశుధ్య నిర్వహణ వంటి అంశాలను అక్కడున్న ప్రజలను అడిగి తెలుసుకున్నారు వారి అభిప్రాయంలో అన్ని బాగున్నాయని తెలిసాక సంతృప్తి చెందారు.
నోడల్ ఆఫీసర్లు ప్రతిరోజు అన్న క్యాంటీన్ పరిశీలించి అక్కడ ఎటువంటి సమస్య తలెత్తనివ్వకుండా చూసుకోవాలని అధికారులను ఆదేశించారు.తదుపరి పున్నమి ఘాట్, భవానిపురం లో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో జరిగిన పర్యావరణ పరిరక్షణ వారోత్సవాల్లో పాల్గొన్నారు. మొక్కలను నాటి, ప్లాస్టిక్ నివారణకు ఏర్పాటుచేసిన డస్ట్ బిన్ లను ప్రారంభించారు. పర్యావరణ హితం కోసం లయన్స్ క్లబ్ వారు నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాలు అభినందించారు.
ఈ పర్యటనలో ఎస్టేట్ ఆఫీసర్ ఏ. శ్రీధర్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు గోపాల కృష్ణ, జె. శ్రీనివాస్, అసిస్టెంట్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ అన్నపూర్ణ, లయన్స్ క్లబ్ సభ్యులు లైన్స్ గవర్నర్ ఆంజనేయులు, ఫస్ట్ గవర్నర్ ఎలెక్ట్ శ్రీనివాసరెడ్డి, సెకండ్ గవర్నర్ ఎలెక్ట్ వై గాంధీ, ఫాస్ట్ గవర్నర్స్ లయన్ ఒక్కళ్లగడ్డ భాస్కర్ రావు, లయన్ దేవినేని జోనీ కుమారి, సభ్యులు పాల్గొన్నారు.
