జైనూర్‌లో ఘనంగా అన్నా బాహు సాటే వర్ధంతి నిర్వహణ

జైనూర్, ఆంధ్రప్రభ: కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండల కేంద్రంలోని గణేష్‌నగర్‌లో మాంగ్ సమాజ్ సంఘం ఆధ్వర్యంలో శనివారం సాహిత్య రత్న డాక్టర్ అన్నా బాహు సాటే 57వ వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా నాయకులు, మాంగ్ సమాజ్ ప్రజలు అన్నా బాహు సాటే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

వక్తలు మాట్లాడుతూ, ప్రజల్లో చైతన్యం కల్పించేందుకు అన్నా బాహు సాటే సాహిత్య రంగంలో చేసిన సేవలు ప్రశంసనీయమని కొనియాడారు. ఆయన ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో ఆసిఫాబాద్ డీసీసీ ప్రధాన కార్యదర్శి షేక్ అబ్దుల్ ముఖిద్, మాంగ్ సమాజ్ కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా అధ్యక్షుడు మావాలే దత్తమాంగ్, అడ్వకేట్ దత్తరాజ్ గైక్వాడ్, జైనూర్ మాజీ వైస్ ఎంపీపీ చీర్లే లక్ష్మణ్ యాదవ్, వార్డు సభ్యుడు తొడసం రవీందర్, కాంగ్రెస్ యువ నాయకుడు మెస్రం అంబాజీరావు, ఆత్రం దత్తు, నాయకులు జిల్లపెల్లి గణేష్, పుల్లారే మారుతి, దుదానే శామ్, పుల్లారే సోఫాన్, యువ నాయకులు, మాంగ్ సమాజ్ ప్రజలు పాల్గొన్నారు.