చిక్కాల కుటుంబానికి కేటీఆర్ పరామర్శ..
సిరిసిల్ల, ఆంధ్రప్రభ : సిరిసిల్ల సెస్ చైర్మన్ చిక్కాల రామారావు కుమారుడు అశ్విన్ రావు ఇటీవలే అనారోగ్యంతో అకాల మరణం చెందగా శనివారం సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని వారి నివాసానికి భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ సిరిసిల్ల శాసనసభ్యులు కేటీఆర్ వెళ్ళి చిక్కాల రామారావు కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. అశ్విన్ చితపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. కేటీఆర్ వెంట ప్రతినిధులు భారత రాష్ట్ర సమితి నాయకులు ఉన్నారు.

