న్యూ ఢిల్లీ: నేడు దేశం మొత్తం ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఐక్యంగా ఉందని, ఉగ్రవాదాన్ని అంతం చేయాలని ప్రజలు దృఢ సంకల్పంతో ఉన్నారని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు.ఆపరేషన్ సింధూర్ తర్వాత నేడు నిర్వహించిన తొలి మన్‌కీ బాత్ మన్ కీ బాత్‌లో మోదీ మాట్లాడుతూ, నేడు ప్రతి భారతీయుడు ఉగ్రవాదాన్ని అంతం చేయాలనే సంకల్పంతో ఉన్నారని స్పష్టం చేశారు.
ఆపరేషన్ సిందూర్ సమయంలో మన సైన్యం ప్రదర్శించిన పరాక్రమం యావత్ దేశాన్ని గర్వపడేలా చేసిందని ఆయన అన్నారు.ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాదంపై పోరాటానికి ఆపరేషన్ సింధూర్ కొత్త విశ్వాసం, ఉత్సాహాన్ని ఇచ్చింది. ఆపరేషన్ సిందూర్ కేవలం సైనిక చర్య కాదు, ఇది మన దృఢ సంకల్పం, ధైర్యం, మారుతున్న భారతదేశం ఇమేజ్‌కి నిదర్శనమని ప్రధాని మోదీ అన్నారు.
మన సైనికులు ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేశారు. అది వారి అజేయమైన ధైర్యం, భారతదేశంలో తయారైన ఆయుధాలు, పరికరాలు, సాంకేతికత శక్తి దీనికి కారణం. దానికి స్వావలంబన భారతదేశం అనే దార్శనికత ఉంది. ఈ విజయంలో మన ఇంజనీర్లు, మన సాంకేతిక నిపుణులు, అందరి చెమటోడ్చారని ప్రధాని మోదీ ప్రశంసించారు.
ఆపరేషన్ సిందూర్ దేశ ప్రజలపై ఎంతటి ప్రభావాన్ని చూపిందంటే, అనేక కుటుంబాలు దానిని తమ జీవితాల్లో ఒక భాగంగా చేసుకున్నాయి. బీహార్‌లోని కతిహార్, ఉత్తరప్రదేశ్‌లోని కుషినగర్, అనేక ఇతర నగరాల్లో ఆ సమయంలో జన్మించిన తమ బిడ్డలకు సిందూరి అని పేరు పెట్టారని ప్రధాని మోదీ గుర్తు చేశారు.
అనేక నగరాలు, గ్రామాలు, పట్టణాలో తిరంగ యాత్రలు నిర్వహించారు. పౌర రక్షణ వాలంటీర్లుగా మారేందుకు అనేక నగరాల నుంచి యువతముందుకు వచ్చారు’ అని మోదీ పేర్కొన్నారు.
నక్సలిజం నిర్మూలనలో ఘన విజయం
మరోవైపు మావోయిస్టుల హింసాత్మక చర్యలుక్రమంగా తగ్గుతున్నాయని తెలిపారు. దంతెవాడు ఆపరేషన్లో జవాన్లు చూపిన సాహసాన్ని ఆయన కొనియాడారు. నక్సలిజానికి వ్యతిరేకంగా పోరాటం కొనసాగుతోందన్నారు. నక్సలిజం నిర్మూలనలో గర్వించే విజయంసాధించామన్నారు.
తెలంగాణ మహిళలకు ప్రశంసలు
తెలంగాణలోని సంగారెడ్డి మహిళల గురించి ప్రధాని మోదీ మన్ కీ బాత్ ప్రస్తావించారు. వ్యవసాయంలో డ్రోన్ల వినియోగాన్ని ఆయన ప్రశంసించారు.
2014 లో ప్రారంభమై ..
మన్ కీ బాత్ కార్యక్రమం అక్టోబర్ 3, 2014న ప్రారంభించారు. ఇది ఫ్రెంచ్, చైనీస్, ఇండోనేషియా, టిబెటన్, బర్మీస్, బలూచి, అరబిక్, పాష్టో, పర్షియన్, డారి, స్వాహిలితో సహా 11 విదేశీ భాషలతో పాటు 22 భారతీయ భాషలు, 29 మాండలికాలలో ప్రసారం అవుతోంది. ‘మన్ కీ బాత్’ కార్యక్రమాన్ని 500 కి పైగా ఆల్ ఇండియా రేడియో స్టేషన్లు ప్రసారం చేస్తున్నాయి.