Akkapur | గ్రామ అభివృద్ధికి కృషి చేస్తా

Akkapur | గ్రామ అభివృద్ధికి కృషి చేస్తా

అక్కాపూర్ గ్రామ సర్పంచ్ అభ్యర్థి బోండ్ల శ్రీవాణి గంగన్న

Akkapur | నిర్మల్ రూరల్, ఆంధ్రప్రభ : అక్కాపూర్ గ్రామ అభివృద్ధి జరగాలంటే ఈనెల 14న జరగనున్న పంచాయతీ ఎన్నికల్లో తనకు ఓటేసి గెలిపించాలని అక్కాపూర్ గ్రామాల్లోని వీధుల్లో ఇంటింటా తిరుగుతూ ఇవాళ‌ బోండ్ల శ్రీవాణి గంగన్న ప్రచారాన్ని చేపట్టారు. గ్రామంలో నెలకొన్న అన్ని సమస్యలకు తాను సర్పంచ్ పదవీ బాధ్యతలు చేపట్టిన మూడు నెలల్లోనే పరిష్కారం చూపుతానని హామీ ఇచ్చా రు.

ముఖ్యంగా గ్రామంలో నెలకొన్న డ్రైనేజీ వ్యవస్థ, సీసీ రోడ్ల సమస్యలను పరిష్కరించేందుకు మొదటి ప్రాధాన్య‌త‌ ఇస్తానని హామీ ఇచ్చారు. అన్ని వేల‌ల్లో ప్రజలకు అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చి విస్తృత ప్రచారాన్ని చేపట్టారు. ప్రజలు అవకాశం ఇస్తే గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు దశలవారీగా కృషి చేస్తాన‌ని, అభివృద్ధికి అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తారని, రెండు గ్రామాలపై ప్రత్యేక దృష్టి పెట్టి సమస్యలను పరిష్కారం చూపి దోహ‌ద‌ప‌డ‌తాన‌ని పేర్కొన్నారు.

Leave a Reply