Breaking | యువకుడికి 25ఏళ్ల జైలుశిక్ష
హైదరాబాద్ : హైదరాబాద్ (Hyderabad) లోని నాంపల్లి కోర్టు సంచలన తీర్పు చెప్పింది. బాలికను వేధించిన ఆకాశ్ (Akash) అనే యువకుడికి 25ఏళ్ల జైలుశిక్ష విధించింది. ఇన్ స్టాగ్రామ్ (Instagram) లో బాలికకు దగ్గరైన యువకుడు బాలిక ఫోటోలతో ఆకాశ్ బ్లాక్ మెయిల్ కు పాల్పడ్డాడు. డబ్బుల కోసం సొంత ఇంట్లోనే బాలిక చోరీలకు పాల్పడింది. తల్లిదండ్రుల ఫిర్యాదుతో ఆకాశ్ పై కేసు నమోదైంది. నిందితుడికి 25ఏళ్ల జైలుశిక్ష (25 years prison) తో పాటు రూ.10వేల జరిమానా విధించింది.

