ఎవరి కదలికలపై పోలీసుల గట్టి నిఘా..?

ఎవరి కదలికలపై పోలీసుల గట్టి నిఘా..?

రౌడీ షీటర్లకు సీఐ చంద్రశేఖర్ హితబోధ

పాయకాపురం, ఆంధ్రప్రభ: విజయవాడ అజిత్ సింగ్ నగర్ లా అండ్ ఆర్డర్ పోలీస్ స్టేషన్‌లో ఆదివారం రౌడీ షీటర్లు, సస్పెక్ట్స్, కేడీలకు కౌన్సెలింగ్ నిర్వహించారు.

సీఐ చంద్రశేఖర్ మాట్లాడుతూ, రౌడీ షీటర్ల కదలికలపై నిరంతరం నిఘా ఉంటుందని స్పష్టం చేశారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే ఎవరినీ ఉపేక్షించబోమని హెచ్చరించారు.

సమాజంలో ఎలా నడుచుకోవాలో, పోలీసుల నిఘా ఎలా ఉంటుందో రౌడీ షీటర్లకు వివరించారు. పద్ధతి మార్చుకోవాలని హితబోధ చేశారు.

ఈ కార్యక్రమంలో ఎస్ఐలు రమ్య, దుర్గాప్రసాద్, రాధికతో పాటు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply