కార్యకర్తల కష్టమే పార్టీకి బలం!…

కార్యకర్తల కష్టమే పార్టీకి బలం!…

వియాజయనికి మూలస్థంభం కార్యకర్తల కష్టం
కార్యకర్తల అభిప్రాయాలే పార్టీకి దిశానిర్దేశం…
రాష్ట్ర అభివృద్ధే అంతిమ లక్ష్యం
ప్రతి కార్యకర్తను కలుపుకుంటూ…
పార్టీ బలోపేతమే ధ్యేయం
విజయవాడ పార్లమెంట్ సభ్యుడు కేశినేని శివనాథ్
వీరులపాడు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలతో ఆత్మీయ సమావేశం..

విజయవాడ, ఆంధ్రప్రభ : ప్రజా ప్రతినిధిగా రెండేళ్ల సేవా ప్రయాణాన్ని విజయవంతంగా పూర్తి చేసుకున్న విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) మరోసారి పార్టీ కేడర్‌తో తన అనుబంధాన్ని చాటుకున్నారు. అధికార పదవిలో ఉన్నప్పటికీ కార్యకర్తల మధ్యే ఉంటూ వారి అభిప్రాయాలకు విలువనిచ్చే నాయకుడిగా తన ప్రత్యేకతను నిరూపించుకుంటూ, నందిగామ నియోజకవర్గంలోని వీరులపాడు మండలానికి చెందిన టీడీపీ ముఖ్య నేతలు, కార్యకర్తలతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం కేవలం రాజకీయ చర్చలకే పరిమితం కాకుండా, పార్టీ భవిష్యత్తు దిశ, అభివృద్ధి కార్యాచరణ, కార్యకర్తల సంక్షేమం వంటి అంశాలపై హృదయపూర్వక సంభాషణగా సాగింది. ప్రతి నాయకుడితో వ్యక్తిగతంగా మాట్లాడిన ఎంపీ చిన్ని, వారి అభిప్రాయాలు, సూచనలు, సమస్యలను ఎంతో ఓపికగా విని పరిష్కార మార్గాలపై చర్చించారు.

అభివృద్ధి ఫలాలు ప్రతి ఇంటికీ చేరాలి..

గత రెండేళ్లలో నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, ప్రస్తుతం కొనసాగుతున్న పనులు, రానున్న రోజుల్లో అమలు చేయబోయే ప్రాజెక్టులపై ఎంపీ చిన్ని సమగ్రంగా వివరించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి కుటుంబానికి చేరుతున్నాయా లేదా అనే విషయంపై ప్రత్యేకంగా ఆరా తీసిన ఆయన, ప్రజల సమస్యల పరిష్కారంలో నాయకులు మరింత చురుకుగా వ్యవహరించాలని సూచించారు.

తెలుగుదేశం పార్టీ ఒక కుటుంబం..

పార్టీ బలోపేతంపై ప్రత్యేకంగా దృష్టి సారించిన ఎంపీ చిన్ని, వ్యక్తిగత విభేదాలకు తావులేకుండా అందరూ ఒకే లక్ష్యంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. “తెలుగుదేశం పార్టీ కేవలం ఒక రాజకీయ పార్టీ కాదనీ లక్షలాది కార్యకర్తల కుటుంబం అన్నారు. పార్టీ కోసం శ్రమించే ప్రతి కార్యకర్త గౌరవం మనందరి బాధ్యత అని తెలిపారు. అసంతృప్తితో ఉన్న వారిని కూడా కలుపుకొని ముందుకు సాగితేనే పార్టీ మరింత బలపడుతుంది” అని స్పష్టం చేశారు.

నాయకుడిగా కాదు… కార్యకర్తగా కలిసిపోయిన ఎంపీ చిన్ని..

ఎంపీ హోదాలో ఉన్నప్పటికీ ఎలాంటి ఆడంబరాలకు తావివ్వకుండా సాధారణ కార్యకర్తలా అందరితో మమేకమవడం సమావేశంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సమావేశం అనంతరం కార్యకర్తలు, మండల నేతలతో కలిసి ఆత్మీయ విందులో పాల్గొని, స్నేహపూర్వకంగా ముచ్చటించడం కేడర్‌ను మరింత ఉత్సాహపరిచింది.
“పార్టీ కోసం కష్టపడే ప్రతి కార్యకర్తను గుర్తించి, వారి మధ్యే ఉంటూ నడిపించే నాయకత్వం ఎంపీ చిన్ని సొంతం. అభివృద్ధి, కార్యకర్తల సంక్షేమం అనే రెండు చక్రాలతో ముందుకు సాగుతున్న ఆయన తీరు మాకు కొత్త ఉత్సాహాన్ని ఇస్తోంది” అని పలువురు నేతలు అభిప్రాయపడ్డారు.

..కేడర్‌కు విలువ ఇచ్చే నాయకత్వం పార్టీకి బలం

ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య మాట్లాడుతూ, ఎంపీ చిన్ని నిరంతరం కేడర్‌తో మమేకమవుతూ వారి అభిప్రాయాలకు విలువ ఇవ్వడం పార్టీ బలోపేతానికి ఎంతో దోహదపడుతోందని అన్నారు. కార్యకర్తలే తెలుగుదేశం పార్టీకి నిజమైన బలమనీ వారి సంక్షేమం, వారి గౌరవమే మనందరి ప్రాధాన్యత అన్నారు. ఎంపీ చిన్ని నాయకత్వంలో పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నెలకొందన్నారు. నాయకులు, కార్యకర్తలు సమిష్టిగా పనిచేస్తే టీడీపీ మరింత బలోపేతం అవుతుంది” అని ఆమె పేర్కొన్నారు.

డర్‌లో నూతనోత్సాహం నింపిన కీలక సమావేశం..

వీరులపాడు మండల నేతలతో జరిగిన ఈ సమావేశం పార్టీ శ్రేణుల్లో నూతన ఉత్సాహాన్ని నింపడమే కాకుండా, భవిష్యత్ రాజకీయ కార్యాచరణకు స్పష్టమైన దిశానిర్దేశం చేసిన సమావేశంగా నిలిచింది. కార్యకర్తల అభిప్రాయాలను ఆలకిస్తూ, వారి మధ్యే ఉంటూ, పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్న ఎంపీ కేశినేని చిన్ని నాయకత్వానికి టీడీపీ శ్రేణుల నుంచి విశేష ఆదరణ వ్యక్తమవుతోంది.

Leave a Reply