గొర్లవీడులో అగ్నికి హావుతైన పామాయిల్ తోట
భూపాలపల్లి రూరల్, ఆంధ్రప్రభ : భూపాలపల్లి జిల్లాలోని గొర్లవీడు గ్రామంలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. భూపాలపల్లి మండలంలోని గొర్లవీడు గ్రామానికి చెందిన రైతు చెలిమెల రాజయ్యకు చెందిన సుమారు 2 ఎకరాల పామాయిల్, సుబాబు తోట అగ్నికి ఆహుతైంది. ఈ ప్రమాదంలో విద్యుత్ మోటార్ వైర్లు, డ్రిప్ పైపులు పూర్తిగా దగ్ధమయ్యాయి.
మంటలు చెలరేగడంతో మోటార్ ద్వారా నీటితో మంటలు ఆర్పేందుకు ప్రయత్నించినప్పటికీ, అప్పటికే మోటార్ వైర్లు కాలిపోవడంతో మంటలను అదుపు చేయడం కష్టమైంది. ఈ సందర్భంగా రైతు రాజయ్య మాట్లాడుతూ నాలుగు సంవత్సరాలుగా ఇంటికంటే ఎక్కువ సమయం తోటలోనే గడుపుతూ పామాయిల్, సుబాబు చెట్లను కంటికి రెప్పలా కాపాడుకున్నానని, అవి అగ్నికి ఆహుతి కావడం ఎంతో బాధ కలిగిస్తోందని ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు.
