ఆస్ట్రేలియా చేరుకున్న ప్రధాని మోదీ..

  • రక్షణ, వాణిజ్యమే అజెండా !

భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రెండు రోజుల అధికారిక పర్యటన నిమిత్తం ఆస్ట్రేలియా చేరుకున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసేందుకు పలు కీలక సమావేశాల్లో ఆయన పాల్గొననున్నారు. ఆస్ట్రేలియా ప్రధానమంత్రి ఆంథోనీ అల్బనీస్‌తో ప్రధాని మోదీ ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. ‘భారత్-ఆస్ట్రేలియా వార్షిక నేతల శిఖరాగ్ర సదస్సు’లో భాగంగా ఇరు దేశాల ప్రధానులు పలు కీలక అంశాలపై చర్చించనున్నారు.

ముఖ్యంగా రక్షణ , ప్రాంతీయ భద్రత, వాణిజ్యం వంటి వ్యూహాత్మక రంగాలలో సహకారాన్ని పెంపొందించుకోవడంపై ఇరు దేశాల అధినేతలు దృష్టి సారించనున్నారు. వీటితో పాటు క్రిటికల్ మినరల్స్, యురేనియం సరఫరా, స్వచ్ఛ ఇంధనంపై కూడా చర్చలు జరగనున్నాయి. మెల్‌బోర్న్ నగరంలో భారీ ఎత్తున ఏర్పాటు చేయనున్న ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొని, అక్కడ నివసిస్తున్న వేలాది మంది ప్రవాస భారతీయులను ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగించనున్నారు.

కట్టుదిట్టమైన భద్రత..

ప్ర‌ధాని ప‌ర్య‌ట‌నకు ముందు ఆన్‌లైన్ లో వ‌చ్చిన‌ కొన్ని బెదిరింపులు, నిరసనల హెచ్చరికల నేపథ్యంలో ఆస్ట్రేలియా ప్రభుత్వం అప్రమత్తమైంది. ప్రధాని మోదీ పర్యటించే ప్రాంతాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఆస్ట్రేలియా భద్రతా విభాగాలు అత్యంత కట్టుదిట్టమైన, నిఘా నీడతో కూడిన భద్రతా ఏర్పాట్లను పూర్తి చేశాయి.