ప్రమాదకరంగా మంచినీటి ట్యాంకు

ప్రమాదకరంగా మంచినీటి ట్యాంకు

ఏ క్షణాన కూలుతుందోనని స్థానికుల్లో భయం

పెనుగంచిప్రోలు, ఆంధ్రప్రభ: మండల కేంద్రంలోని పడమటి బజారులో ఉన్న మంచినీటి ట్యాంకు ప్రమాదకరంగా మారింది. ట్యాంకు నుంచి నీరు లీకేజీ అవుతుండటంతో అది శిథిలావస్థకు చేరుకుంటోంది.

ట్యాంకు పిల్లర్లు దెబ్బతింటుండటంతో ఏ క్షణాన ఏ ప్రమాదం జరుగుతుందోనని స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. ముఖ్యంగా ఈ ట్యాంకు ప్రధాన రహదారి పక్కనే ఉండడంతో, ప్రతిరోజూ రద్దీగా ఉండే ఈ మార్గంలో ప్రమాదం జరిగితే భారీగా ప్రాణనష్టం జరిగే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ప్రమాదకరంగా ఉన్న ఈ ట్యాంకును సంబంధిత శాఖ అధికారులు వెంటనే పరిశీలించాలని స్థానికులు కోరుతున్నారు. ప్రమాద తీవ్రతను గుర్తించి, ప్రమాదం జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. అవసరమైతే నిపుణుల సలహాలు తీసుకుని తక్షణ చర్యలు చేపట్టాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

Leave a Reply