దుర్గమ్మను దర్శించుకున్న ఎయిర్ కమోడోర్ దంపతులు..

విజయవాడ, ఆంధ్రప్రభ : భారత వాయుసేనకు చెందిన ఎయిర్ కమోడోర్ నర్సింగ్ సైలాని, ఆయన సతీమణి రిను సైలాని బుధవారం ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్లను దర్శించుకుని అమ్మవారి ఆశీస్సులు పొందారు.

ఈ సందర్భంగా దేవస్థాన అధికారులు ఆలయ మర్యాదలతో వారికి ఘనంగా స్వాగతం పలికి, ప్రత్యేక దర్శనం కల్పించారు. అనంతరం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు, అమ్మవారి చిత్రపటాన్ని అందజేసి సత్కరించారు.

వారి దర్శనానికి సంబంధించిన ఏర్పాట్లను 8(ఎ) ఎయిర్ స్క్వాడ్రన్ ఎన్‌సీసీ, విజయవాడ ప్రతినిధులు దేవస్థాన అధికారులతో సమన్వయం చేసుకుని ప్రత్యేకంగా నిర్వహించారు.