చల్లపల్లిలో పొట్టి శ్రీరాములు జయంతి

చల్లపల్లిలో పొట్టి శ్రీరాములు జయంతి

చల్లపల్లి, ఆంధ్రప్రభ : అమరజీవి పొట్టి శ్రీరాములు వారి 125వ జయంతి సందర్భంగా చల్లపల్లి శ్రీ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో పొట్టి శ్రీరాములు వారి కాంస్య విగ్రహానికి పూలమాలలు సమర్పించి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం 58 రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేసి అసువులు బాసిన త్యాగమూర్తి శ్రీ పొట్టి శ్రీరాములు భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు కారుకులైనారని ఆర్యవైశ్య సంఘ కార్యదర్శి వరదా హరి గోపాల్ పేర్కొన్నారు.

పొట్టి శ్రీరాముల వారి 125 వ జయంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో శ్రీ పొట్టి శ్రీరాములు వారి 58 అడుగుల కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్న సందర్భంగా ప్రభుత్వానికి ఆర్యవైశ్య సంఘ నేతలు తమ కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సంఘ అధ్యక్షులు అన్నవరపు పాండురంగారావు, కళ్యాణ మండపం అధ్యక్షులు కొల్లిపర మధు, వాసవి క్లబ్ అధ్యక్షులు వరద రాజశేఖర్, శ్రీ ఆర్యవైశ్య యువజన సంఘం అధ్యక్షులు తమ్మన సాంబశివరావు, కొలిపర సాంబశివరావు, గోళ్ళ రాంప్రసాద్, కొల్లిపర రజిని, నరేంద్ర, ద్రోణ, తమ్మన ప్రసాద్, ఉడత్తు సురేష్, నరసింహారావు, విస్సంశెట్టి గుప్తా, జ్యోతి తదితరులు పాల్గొన్నారు.