బెజ్జంకి బీసీ బాలుర వసతి గృహంలో అడ్మిషన్లు ప్రారంభం

బెజ్జంకి, ఆంధ్రప్రభ : 2026–27 విద్యా సంవత్సరానికి బెజ్జంకి బీసీ బాలుర వసతి గృహంలో ప్రవేశాలు ప్రారంభమైనట్లు వసతి గృహ సంక్షేమ అధికారి నవీన్ కుమార్ తెలిపారు. మూడవ తరగతి నుండి పదవ తరగతి వరకు చదివే బాలురకు ఉచిత వసతి, భోజనం, పాఠ్యపుస్తకాలు, దుస్తులు, బెడ్డింగ్ తదితర సౌకర్యాలు కల్పించబడనున్నాయని పేర్కొన్నారు. బీసీతో పాటు ఓసీ, ఎస్టీ వర్గాల విద్యార్థులు కూడా అర్హులని తెలిపారు. చదువులో వెనుకబడిన విద్యార్థులకు ప్రత్యేక ట్యూషన్లు, ఆరోగ్య పరీక్షలు, క్రీడా సదుపాయాలు అందుబాటులో ఉంటాయని వెల్లడించారు. ఆసక్తి గల వారు వెంటనే వసతి గృహంలో సంప్రదించాలని కోరారు.