వృద్ధురాలి పుస్తెలతాడు అప‌హ‌ర‌ణ‌…

ధర్మారం (ఆంధ్రప్రభ) : పెన్షన్ వచ్చిందంటూ నమ్మించి, ఓ వృద్ధురాలి మెడలో ఉన్న మూడు తులాల బంగారు పుస్తెల తాడును అపహరించిన ఘటన పెద్దపల్లి జిల్లా ధర్మారంలో జరిగింది.

వివరాల్లోకి వెళితే.. ధర్మారం మండల కేంద్రానికి చెందిన బుదారపు శంకరమ్మ (67) శుక్రవారం ఉదయం మెయిన్ రోడ్డులో నడుచుకుంటూ వెళ్తుండగా, ఆమెకు ఒక గుర్తు తెలియని వ్యక్తి పరిచయం చేసుకున్నాడు.

ఆ వ్యక్తి శంకరమ్మతో “మీకు రూ.4000 పెన్షన్ మంజూరైంది, దాని కోసం ఫోటో అప్‌లోడ్ చేయాలి” అని చెప్పి నమ్మించాడు.
అనంతరం, “ఫోటోలో మెడలో ఉన్న బంగారు పుస్తెల తాడు కనిపిస్తే పెన్షన్ రాదు” అని చెప్పడంతో, వృద్ధురాలు శంకరమ్మ నమ్మి ఆ పుస్తెల తాడును తీసి ఆ వ్యక్తి చేతిలో పెట్టింది.

ఆ వెంటనే సదరు వ్యక్తి బంగారు తాడు తీసుకుని పరారయ్యాడు. ఈ హఠాత్ పరిణామంతో మోసపోయానని గ్రహించిన వృద్ధురాలు లబోదిబోమంటూ ధర్మారం పోలీస్ స్టేషన్‌కు చేరుకుని ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి, సీసీ ఫుటేజీ ఆధారంగా దొంగ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

Leave a Reply