Road Accident | ముగ్గురు మృతి..
Road Accident | ముగ్గురు మృతి..
Road Accident | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్ : కర్ణాటకలోని తుమకూరు జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం విషాదాన్ని మిగిల్చింది. రెండు కార్లు ఎదురెదురుగా ఢీకొన్న ఈ ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ముగ్గురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడగా, వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
ప్రమాదంలో మృతిచెందిన వారిని కర్నూలు జిల్లా ఆదోనికి చెందిన గజేశ్వర్ (65), ఇందిరా (55), సౌమ్య (35)గా పోలీసులు గుర్తించారు. ప్రమాద తీవ్రతకు కార్లు నుజ్జునుజ్జు కావడంతో బాధితులు తీవ్రంగా గాయపడ్డారు.
ఈ ఘటనలో మరో ముగ్గురు తీవ్రంగా గాయపడగా, వారిని సమీప ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేశారు. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు కొనసాగుతోంది.
