Adilabad | కాపాస్ కిసాన్ యాప్‌ను రద్దు చేయాలి…
Adilabad | తిర్యాణి, ఆంధ్రప్రభ : ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన కాపాస్ కిసాన్ యాప్(Capas Kisan App)ను రద్దు చేసి రైతులను ఆదుకోవాలని బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు హనుండ్ల జగదీష్ అన్నారు. బీఆర్ఎస్ పార్టీ పిలుపుమేరకు ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవా లక్ష్మీ(Koa Lakshmi) ఆదేశాల మేరకు ఈ రోజు మండల తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు.
అనంతరం తహసిల్దార్ శ్రీనివాస్‌కు వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల నడ్డి విరిచే కార్యక్రమాన్ని చేపడుతున్నాయని మండిపడ్డారు. కాపాస్ కిసాన్ యాప్ వల్ల అమాయకులైన రైతులు మోసపోతున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వాలు వెంటనే రైతుల వద్ద నుంచి ఎకరాకు 12 క్వింటాళ్ల పత్తి(12 quintals of cotton)ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా ఆసిఫాబాద్ లో పెద్ద ఎత్తున ఆందోళ ర్యక్రమాన్ని చేపట్టబోతున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ చుంచు శ్రీనివాస్, వైస్ చైర్మన్ టెంట్ శ్రీనివాస్, మాజీ జేడ్పీటీసీ ఆత్రం చంద్రశేఖర్, పార్టీ యువ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

