హైదరాబాద్ : బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ సిల్వర్ జూబ్లీ వేడుకల సందర్భంగా ఈనెల 27న వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో నిర్వహించే రజోతోత్సవ సంబురం సభకు పార్టీ రంగారెడ్డి జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు పట్నం అవినాష్ రెడ్డి తన వంతు సహకారాన్ని అందిస్తున్నారు. ఇందులో భాగంగా తన వంతుగా పార్టీ కోసం రూ.25 లక్షల చెక్కును ఆయన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావుకు అందించారు.
ఈ సందర్భంగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అవినాష్ రెడ్డిని అభినందించారు. పార్టీ కార్యకర్తగా కేసీఆర్ అడుగుజాడల్లో నడుస్తూ కేటీఆర్, హరీష్ రావు, సబిత ఇంద్రారెడ్డి, పట్నం నరేందర్ రెడ్డి, కార్యకర్తల తదితరులతో కలిసి పార్టీ అభివృద్ధికి కృషి చేస్తానని అవినాష్ రెడ్డి అన్నారు.