Telangana | శ్రీచౌడేశ్వరిమాత వార్షికోత్సవ వేడుకలు
Telangana | ఊట్కూర్, ఆంధ్రప్రభ : నారాయణపేట జిల్లా (Narayanpet district) ఊట్కూర్ మండల పరిధిలోని పులిమామిడి గ్రామంలో శ్రీ చౌడేశ్వరి మాత 8వ వార్షికోత్సవ వేడుకలు (8th Anniversary Celebrations) శనివారం భక్తిశ్రద్ధలతో వైభవంగా నిర్వహించారు. శ్రీ చౌడేశ్వరిమాత దేవాలయంలో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి యజ్ఞం, అభిషేకం, మహా మంగళహారతి అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు.
దేవాంగ సమాజ సభ్యులు, గ్రామస్తులు గ్రామంలో అమ్మవారి వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా నిర్వహించిన ఊరేగింపు (procession) డప్పు మేళాతాళాల మధ్య కన్నుల పండుగగా కొనసాగింది. ఈ కార్యక్రమంలో దేవాంగ సమాజ సభ్యులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

