ఘనంగా ఆచార్య ఎన్.జి రంగా 125వ జయంతి
(ఘంటసాల – ఆంధ్రప్రభ) : ఆచార్య ఎన్.జి రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలోని ఘంటసాల కృషి విజ్ఞాన కేంద్రం (Ghantasala Krishi Vigyan Kendram) లో శుక్రవారం ఆచార్య ఎన్.జి రంగా 125వ జయంతి వేడుకలు, వందేమాతర గేయ రచనకు 150వ సంవత్సరాల పూర్తయిన కార్యక్రమాన్ని ప్రోగ్రాం కోఆర్డినేటర్ సుధారాణి ఆధ్వర్యంలో డా.నవీన్ (Dr. Naveen) ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో భాగంగా ముందుగా సుధారాణి మాట్లాడుతూ… ఎన్.జి.రంగా రైతుల పట్ల చేసిన సేవలను కొనియాడుతూ.. విద్యార్థులకు, సిబ్బందికి ఆయన గొప్పతనం తెలియచేశారు. అనంతరం కేవీకే సిబ్బంది, ఘంటసాల ఉన్నత పాఠశాల విద్యార్థులు, అందరూ సామూహికంగా వందేమాతరం గేయాన్ని ఆలపించారు. ఈ కార్యక్రమంలో ప్రోగ్రాం కోఆర్డినేటర్ డాక్టర్ డి సుధారాణి, కెవికె సిబ్బంది, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

