కనకదుర్గమ్మకు 508 గ్రాముల వెండి కానుక

కనకదుర్గమ్మకు 508 గ్రాముల వెండి కానుక
రూ.1.36 లక్షల విలువైన విరాళం సమర్పించిన భక్త కుటుంబం
ఇంద్రకీలాద్రి, ఆంధ్రప్రభ: విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో కనకదుర్గమ్మవారికి భక్తులు మరో విలువైన కానుకను సమర్పించారు.విజయవాడ మధు చౌక్‌కు చెందిన వీటి స్వరూపరాణి, ఆమె కుటుంబ సభ్యులు అమ్మవారికి 508 గ్రాముల బరువున్న వెండిని విరాళంగా అందజేశారు. సుమారు రూ.1,36,500 విలువైన ఈ వెండి కానుకను దేవస్థానం చైర్మన్ బొర్రా రాధాకృష్ణ (గాంధీ)కు అధికారికంగా అందించారు.
అనంతరం అమ్మవారి సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించి వెండిని దేవస్థానానికి సమర్పించారు. ఈ సందర్భంగా దాతలకు దేవస్థానం అధికారులు ప్రత్యేక దర్శనం ఏర్పాటు చేశారు. దుర్గగుడి చైర్మన్ బొర్రా రాధాకృష్ణ (గాంధీ) దాతలకు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, విరాళం రసీదును అందజేశారు.
