మహిళలకు చీరకట్టే అందం..

సంస్కృతి సాంప్రదాయాలు ప్రతిభంభించేది చీరె
సినీనటి అనసూయ…

విజయవాడ, ఆంధ్రప్రభ : మహిళలకు చీర కట్టే అందమని, మన సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబందించేదే చిరేనని ప్రముఖ సినీనటి యాంకర్ అనసూయ పేర్కొన్నారు. విజయవాడ బీసెంట్ రోడ్డులో మోడ్రన్ సూపర్ మార్కెట్ సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసిన ‘శుభప్రదం’ మహిళల ప్రత్యేక షోరూమ్‌ను ప్రముఖ సినీనటి అనసూయ భరద్వాజ్ గురువారం లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం షోరూమ్‌లోని చీరలు, డ్రస్ మెటీరియల్స్, వన్ గ్రామ్ జ్యువెలరీ తదితర ఉత్పత్తులను పరిశీలించిన ఆమె, నాణ్యతతో పాటు అందుబాటు ధరలు ఆకట్టుకున్నాయని పేర్కొన్నారు.

‘లేడీస్ ఫస్ట్.. ఫ్యాషన్‌లో బెస్ట్’ అనే భావనతో మహిళలకు అవసరమైన అన్ని రకాల వస్త్రాలు, ఆభరణాలను ఒకే వేదికపై అందుబాటులోకి తీసుకురావడం అభినందనీయమన్నారు. ఈ సందర్భంగా శుభప్రదం చైర్మన్ సత్యనారాయణ మాట్లాడుతూ, ఇది సంస్థకు నాలుగో బ్రాంచ్ అని తెలిపారు. గ్రౌండ్ ప్లస్ రెండు అంతస్తుల్లో ఏర్పాటు చేసిన ఈ షోరూమ్‌లో రూ.99 నుంచి రూ.40 వేల వరకు చీరలు, చుడీదార్లు, వెస్ట్రన్ వేర్, వన్ గ్రామ్ జ్యువెలరీ, బ్లౌజులు తదితర మహిళలకు సంబంధించిన విభిన్న ఉత్పత్తులు అందుబాటులో ఉంటాయని చెప్పారు. మధ్యతరగతి వినియోగదారులను దృష్టిలో పెట్టుకుని నాణ్యమైన ఉత్పత్తులను సరసమైన ధరలకు అందిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు సునీత, జ్ఞానేశ్వర్, భవాని, రోహన్ తదితరులు పాల్గొన్నారు.