ప్రజల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం…
ప్రభుత్వ విప్ బొండా ఉమామహేశ్వరరావు
పాయకాపురం, ఆంధ్రప్రభ : ప్రజల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని, సుమారు10 మంది లబ్ధిదారులకు రూ.7.68 లక్షల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు గురువారం సింగ్ నగర్ సెంట్రల్ టీడీపీ కార్యాలయంలో పంపిణీ చేశారు. 60వ, 62వ డివిజన్లకు చెందిన 10 మంది లబ్ధిదారులకు మొత్తం రూ.7,68,000 విలువైన ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను ఎమ్మెల్యే అందజేశారు.
ఆర్థిక ఇబ్బందులతో వైద్యం చేయించుకోలేని పేద, మధ్యతరగతి కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయనిధి ఒక గొప్ప భరోసాగా నిలుస్తోందన్నారు, ప్రజల నుంచి వచ్చే ప్రతి దరఖాస్తును అత్యంత ప్రాధాన్యతతో పరిశీలించి, అర్హులైన వారికి త్వరితగతిన సహాయం అందేలా ముఖ్యమంత్రి కార్యాలయంతో నిరంతరం సమన్వయం చేస్తున్నామని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ఘంటా కృష్ణమోహన్, పైడి శ్రీను, జలకం రాజా, కంచి ధనశేఖర్, కంచేటి నాగరాజు,దొడ్ల చిన్నారావు, బుగత శ్రీరాములు,బేవర నారాయణ, జటాధర్ తదితరులు పాల్గొన్నారు.
