ఈ నెల 15న అవనిగడ్డలో జాబ్ మేళా

నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలి: ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్

అవనిగడ్డ, ఆంధ్రప్రభ: రాష్ట్ర ప్రభుత్వ నైపుణ్య అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఈ నెల 15న అవనిగడ్డ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జాబ్ మేళా నిర్వహించనున్నట్లు ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ తెలిపారు.

గురువారం అవనిగడ్డలోని తన కార్యాలయంలో జాబ్ మేళా పోస్టర్లను ఎమ్మెల్యే ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉదయం 9 గంటలకు ప్రారంభమయ్యే జాబ్ మేళాను నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకుని ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకోవాలని కోరారు.

ఈ కార్యక్రమంలో నియోజకవర్గ యువనాయకుడు మండలి వెంకట్రామ్, నైపుణ్య అభివృద్ధి సంస్థ కో-ఆర్డినేటర్ పృథ్వీజ పాల్గొన్నారు.