ఏడి కార్యాలయం పై ఏసీబీ అధికారులు దాడులు..

ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : నల్లగొండ జిల్లా దేవరకొండలో అవినీతి వ్యతిరేక శాఖ (ఏసీబీ) అధికారులు సంచలన దాడులు నిర్వహించారు. విద్యుత్ శాఖ ఏడి కార్యాలయంపై దాడి చేసిన అధికారులు, అసిస్టెంట్ డివిజనల్ ఇంజినీర్ (ఏడి) సైదులను లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఫిర్యాదు మేరకు ముందుగానే పన్నిన ఉచ్చులో భాగంగా ఏసీబీ అధికారులు ఈ ఆపరేషన్ చేపట్టినట్లు సమాచారం. సైదులు రూ.30,000 లంచం స్వీకరిస్తున్న సమయంలోనే అధికారులు అతడిని అదుపులోకి తీసుకున్నారు.

అనంతరం కార్యాలయంలో విస్తృతంగా సోదాలు నిర్వహించిన ఏసీబీ బృందం, లంచం డబ్బుతో పాటు సంబంధిత పత్రాలను స్వాధీనం చేసుకుంది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. పట్టుబడిన సైదులుపై కేసు నమోదు చేసిన ఏసీబీ అధికారులు, విచారణ కొనసాగిస్తున్నారు. ఈ లంచం వ్యవహారానికి సంబంధించి మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఇటీవల ప్రభుత్వ శాఖల్లో అవినీతి కేసులు పెరుగుతున్న నేపథ్యంలో, ఏసీబీ అధికారులు కఠిన చర్యలు తీసుకుంటున్నారని, ఇలాంటి దాడులు కొనసాగుతాయని వెల్లడించారు.

Leave a Reply