Jailer 2 | అసలు ఏం జరిగింది..?

Jailer 2 | అసలు ఏం జరిగింది..?

Jailer 2 | సెట్స్ నుంచి జరిగిన లీక్ షాక్
మేకర్స్ నుంచి కఠిన హెచ్చరిక
పైరసీపై పెరుగుతున్న ఆందోళన
జైలర్ 2పై భారీ అంచనాలు

Jailer 2 | ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ జైలర్ 2. నెల్సన్ దిలీప్ కుమార్ తెరకెక్కిస్తున్నారు. జైలర్ పార్ట్ 1 హిట్ అవ్వడంతో.. జైలర్ పార్ట్ 2 పై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇదిలా ఉంట.. ఇటీవల జన నాయగన్ మూవీ లీకైంది. ఇప్పుడు జైలర్ 2 కు కూడా లీకైందనే వార్త హాట్ టాపిక్ అయ్యింది. అసలు ఎలా లీకైంది..? జైలర్ 2 లీక్ గురించి మేకర్స్ ఏమంటున్నారు..?

Jailer 2 | సెట్స్ నుంచి లీక్..

Jailer 2

సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తున్న భారీ చిత్రం జైలర్ 2 మరోసారి వార్తల్లో నిలిచింది. ఈసారి కారణం సినిమా నుంచి కొన్ని ఫుటేజ్ లీక్ కావడమే. అయితే.. ఎలా లీకైంది అంటే.. సెట్స్ నుంచే వీడియో లీక్ అయ్యిందని ఇండస్ట్రీలో వినిపిస్తోంది. ఇటీవల జైలర్ 2 షూటింగ్ జరుగుతున్న సమయంలో తీసిన సీన్స్ వీడియో సోషల్ మీడియాలో లీక్ అయినట్లు సమాచారం. ఈ వీడియోలో కొన్ని కీలక సన్నివేశాలు కనిపించడంతో అభిమానుల్లో ఆసక్తి పెరిగింది. అయితే.. ఇదే సమయంలో మేకర్స్‌కు పెద్ద షాక్‌గా మారింది.

Jailer 2 | మేకర్స్ కఠిన హెచ్చరిక..

Jailer 2

ఈ లీక్‌ పై సినిమా నిర్మాతలు, ముఖ్యంగా పిక్చర్స్ సంస్థ, సీరియస్‌గా స్పందించింది. సోషల్ మీడియాలో వీడియో షేర్ చేస్తున్న అకౌంట్స్‌ పై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అలాగే యాంటీ-పైరసీ టీమ్స్ ఇప్పటికే రంగంలోకి దిగినట్లు సమాచారం. లీక్ అయిన క్లిప్స్ వేగంగా వైరల్ కావడంతో, సినిమా పై హైప్ మరింత పెరిగింది. అయితే.. ఇది మేకర్స్‌కు మాత్రం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఎందుకంటే.. ఇలాంటి లీకులు సినిమా కథ, సర్ప్రైజ్ ఎలిమెంట్స్‌ను ముందుగానే బయటపెట్టే ప్రమాదం ఉంది.

Jailer 2 | భారీ అంచనాల్లో జైలర్ 2..

Jailer 2

నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా, 2023లో వచ్చిన జైలర్ మూవీకి సీక్వెల్. ఈ మూవీలో.. మళ్లీ రజినీకాంత్ తన పవర్‌ ఫుల్ పాత్రలో కనిపించనున్నారు. అలాగే మెహన్ లాల్, శివ రాజ్ కుమార్ వంటి స్టార్ క్యాస్ట్ కూడా ఇందులో భాగమవుతున్నారు. ఇటీవల సౌత్ ఇండస్ట్రీలో సినిమాల లీక్‌లు పెరుగుతున్న నేపథ్యంలో, జైలర్ 2 ఘటన మరోసారి పైరసీ సమస్యను హైలైట్ చేసింది. మేకర్స్ ఇప్పుడు మరింత జాగ్రత్తలు తీసుకునే అవకాశం ఉంది. జైలర్ 2 లీక్ ఘటన సినిమా హైప్‌ను పెంచినప్పటికీ, మేకర్స్‌కు ఇది పెద్ద సవాల్‌గా మారింది. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.

Jailer 2

Leave a Reply