బండి భగీరధను వెంటనే అరెస్ట్ చేయాలి..

దమ్మపేట, ఆంధ్రప్రభ ; మైనర్ బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డ బండి భగీరథను వెంటనే అరెస్టు చేయాలని,బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని సీఐటీయూ మండల కన్వీనర్ మురహరి రఘు డిమాండ్ చేశారు. బండి భగీరథను అరెస్టు చేయాలని దమ్మ పేటలో శుక్రవారం సీఐటీయూ మండల కమిటీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా మురహరి రఘు మాట్లాడుతూ.. బాలికపై లైంగిక దాడి ఘటన జరిగి రోజులు గడుస్తున్నప్పటికీ బండి భగీరథను అరెస్టు చేయడంలో రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం మీన మేషాలు లెక్కపెడుతుందని, దుర్యోధన దుశ్యాసన లాగా రేవంత్ రెడ్డి, బండి సంజయ్ కలయిక ఉందని అన్నారు.

నేటి పాలకులు చెబుతున్నవి శ్రీరంగనీతులు చేసేవి అశ్లీల అత్యాచారాలు పనులు చందంగా బండి సంజయ్ పనితనం ఉందన్నారు. పేదవాడు అనామకుడు ఎవరైనా అత్యాచారానికి పాల్పడితే 24 గంటల్లొ ఎన్కౌంటర్ చేసే పోలీసులు రాజకీయ అండదండలు ఉన్నవాడు హత్యాచారానికి పాల్పడితే చట్టం మాత్రం చుట్టంగా మారుతుందని అన్నారు. అధికారాన్ని అడ్డం పెట్టుకొని కేసులను తప్పుదోవ పట్టిస్తూ బాధిత కుటుంబాన్ని భయభ్రాంతులకు గురి చేస్తున్న వారిపై చట్టపరమైన క్రిమినల్ కేసులు నమోదు చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు కోడూరు కృష్ణ, నరసింహారావు, రాఘవయ్య, లక్ష్మీనారాయణ, రాము తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply