పిఎసిఎస్ చైర్మన్ గా రామయ్య బాధ్యతలు స్వీకరణ..

ఆళ్లపల్లి, ఆంధ్రప్రభ : ఉమ్మడి గుండాల మండల పిఎసిఎస్ కోపరేట్ చైర్మన్ పదవి పదవి బాధ్యతలు స్వీకరించడంతో సొసైటీ డైరెక్టర్లు హర్షం వ్యక్తం చేయడం జరిగిందని ఉమ్మడి గుండాల మండలాల పిఎసిఎస్ చైర్మన్ గోగ్గల రామయ్య తెలిపారు. ఈ సందర్భంగా చైర్మన్ రామయ్య మాట్లాడుతూ..ఇటీవల నిర్విరామంగా పిఎసిఎస్ చైర్మన్ పదవిని ఎంతో నిష్టతగా గర్వంగా చేపట్టడం జరిగిందని, గత డిసెంబర్ 19 నుండి మండల ప్రత్యేక అధికారుల ఆధ్వర్యంలో సొసైటీ విధులను చేపట్టడం జరిగిందన్నారు.
ఈ నేపథ్యంలో రాష్ట్ర హైకోర్టు, రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు పిఎసిఎస్ పాత చైర్మన్ లను కొనసాగించాలని ఆదేశాలు జారీ చేయడంతో తిరిగి పాత చైర్మన్లు కొలువులు తీరారు ఉమ్మడి గుండాల ఆళ్లపల్లి మండలాల్లోని రైతులకు సేవచేసేందుకు పిఎసిఎస్ చైర్మన్ పదవిని అధిష్టించడం జరిగిందని, తిరిగి ప్రభుత్వం పాత చైర్మన్లకు బాధ్యతలు అప్పజెప్పడం నా అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు. అనంతరం పిఎసిఎస్ సిబ్బంది డైరెక్టర్లు ఆధ్వర్యంలో చైర్మన్ రామయ్యకు ప్రత్యేకంగా పట్టు శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.
అనంతరం డైరెక్టర్లకు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలపడం జరుగుతుందని చైర్మన్ రామయ్య పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి మండల పిఎసిఎస్ ఉపాధ్యక్షులు ఈసం శాంతమ్మ, డైరెక్టర్లు సయ్యద్ హాఫిజ్, ఈసం సాంబశివరావు, తాళ్లపల్లి సాయన్న మర్కోడు,పాయం సమ్మయ్య, షేక్ సాబీర్, కల్తీ బుచ్చయ్య, ఈసం కృష్ణ,తప్పేట్ల రాంబాబు, వట్టం శ్రీనువాస్, ఈసం సమ్మయ్య, మంజుల,సీఈఓ యాకుబ్ పాషా, ఆఫీస్ స్టాప్ అరేం కాంతారావు, వజ్జ రామూర్తి, పూనెం రాంబాబు, పర్షిక, అమిలా తదితరులు పాల్గొన్నారు.
