Utnoor | ఎమ్మెల్యే సమక్షంలో విశ్రాంతి ఈఓ మసూద్ అలీ చేరిక

Utnoor | ఎమ్మెల్యే సమక్షంలో విశ్రాంతి ఈఓ మసూద్ అలీ చేరిక

Utnoor | ఉట్నూర్, ఆంధ్రప్రభ : పంచాయతీరాజ్ శాఖలో ఈవో గా పనిచేసి రిటైర్డ్ అయిన ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ కు చెందిన మసూద్ అలీ ఇవాళ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే బొజ్జు పటేల్ ను కలిసి ఆయన సమక్షంలో కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. కాంగ్రెస్ లో చేరిన విశ్రాంతి ఈఓ మసూద్ అలీకి ఎమ్మెల్యే బొజ్జు పటేల్ పార్టీ కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు.

Utnoor

ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు అందేలా పార్టీ బలపడేలా అంకితభావంతో పనిచేయాలని కోరారు. కాంగ్రెస్ పార్టీలో కష్టపడి పనిచేసే వారికి మంచి గుర్తింపు ఉంటుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈసందర్భంగా మసూద్ అలీతో పాటు కాంగ్రెస్ నాయకులు ఎమ్మెల్యే బొజ్జు పటేల్ కు సంక్రాంతి కనుమ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ చేరిక కార్యక్రమంలో లక్కారం గ్రామ పెద్దలు సీత గొంది ఆత్రం గంగాధర్ రావు దొర, లక్కారం మాజీ సర్పంచ్ మర్సు కొల తిరుపతి, లక్కారం ఉపసర్పంచ్ ఆరి పెళ్లి రాజేశం, వార్డు సభ్యులు కొమ్ము భీమన్న పాల్గొన్నారు.