కడెం విజయ డైరీ సందర్శించిన డిప్యూటీ డైరెక్టర్..
కడెం, ఆంధ్రప్రభ : కడెం మండల కేంద్రంలోని కడెం విజయ డైరీని మంగళవారం ఆదిలాబాద్ డిప్యూటీ డైరెక్టర్ శ్రీనివాస్ సందర్శించారు. ఈ సందర్భంగా నిర్మల్ మిల్క్ షెడ్ పరిధిలో పాల సేకరణ, పాల నాణ్యత, కొత్త పాల సెంటర్ల ఏర్పాటు అంశాలపై ఆయన సమీక్ష నిర్వహించారు.
డైరీకి సంబంధించిన అన్ని రిజిస్టర్లను పరిశీలించిన ఆయన, ఈ ఆర్థిక సంవత్సరంలో మరో 10 నుంచి 15 గ్రామాలను కొత్తగా ఎంపిక చేసి పాల సేకరణ విస్తరించాలని సూచించారు. అలాగే పాల రవాణా చేసే వాహనాలు సమయానికి డైరీకి చేరేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సందర్శనలో డైరీ మేనేజర్ ఎస్. వెంకటస్వామి, సిబ్బంది పాల్గొన్నారు.
