రూ.20 కోట్ల రహదారి పనులకు శంకుస్థాపన

కుబీర్, ఆంధ్రప్రభ : రాజకీయాలకతీతంగా ముధోల్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడమే తన దేయమని ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్ అన్నారు. మంగళవారం కుబీర్ మండలంలోని మాలేగామ్ గ్రామంలో బైంసా నుండి మిర్జాపూర్, లింగా,కుంబి, నిగ్వ మహారాష్ట్ర బోర్డర్ వరకు 20 కోట్ల రూపాయల నిధులతో నిర్మిస్తున్న రోడ్డుకు శంకుస్థాపన చేసిన సందర్భంగా ఆయన మాట్లాడారు. ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం గత పది సంవత్సరాలుగా ప్రజలు ఇబ్బందులు పడుతున్న రహదారిని బాగు చేయడం జరుగుతుందన్నారు. దశలవారీగా గ్రామీణ రోడ్లను మెరుగుపరుస్తానన్నారు.

నియోజకవర్గం అభివృద్ధి కోసం పలుమార్లు ముఖ్యమంత్రి, మంత్రులను నియోజకవర్గ శాసనసభ్యునిగా కలవడం జరిగిందన్నారు. అభివృద్ధి కోసం నిధులు మంజూరు చేస్తున్న ప్రభుత్వానికి ఆయన కృతజ్ఞతలు చెప్పారు. అభివృద్ధి కోసం రాజకీయాలకతీతంగా ప్రోటోకాల్ ప్రకారం ముఖ్యమంత్రిని మంత్రులను, ప్రధానమంత్రిని కేంద్ర మంత్రులను, కలవడం జరుగుతుందన్నారు. బాసర ఆలయానికి నిధులు మంజూరు చేయాలని, గత పాలకుల నిర్లక్ష్య వైఖరి వల్ల ఆలయ అభివృద్ధి కుంటుపడిందని పలుమార్లు శాసనసభలో ప్రస్తావించడంతోపాటు, ముఖ్యమంత్రికి మంత్రులను కలవడం జరిగిందన్నారు.

75 సంవత్సరాల చరిత్రలో తాను శాసనసభ్యునిగా ఎన్నికైనప్పటినుండి ఎవ్వరు మాట్లాడని విధంగా బాసర ఆలయం గురించి ఎక్కువగా మాట్లాడటం జరిగిందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పలుమార్లు సమస్యలు విన్నవించడంతో ఒకేసారి ఆలయ నిర్మాణానికి 225 కోట్లు, ముధోల్ ఇంటిగ్రేటెడ్ పాఠశాలకు 200 కోట్లు నిధులు మంజూరు కావడం తన అదృష్టంగా భావిస్తున్నాను అన్నారు. అప్పట్లో నిధులు మంజూరు చేయకపోతే మంత్రి కొండా సురేఖ సమక్షంలో భిక్షాటన చేసైనా ఆలయాన్ని అభివృద్ధి చేస్తానని చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు.

అభివృద్ధి కోసం ప్రోటోకాల్ ప్రకారం అందరినీ విన్నవిస్తున్న దశల వారిగా నిధులు తెచ్చుకుంటున్నామని అన్నారు. అయితే ప్రోటోకాల్ కు విరుద్ధంగా ఓడిపోయిన మాజీ ఎమ్మెల్యే వద్ద కొంతమంది సర్పంచ్ లు ప్రొసీడింగ్ లు తీసుకోవడం ఏంటని ప్రశ్నించారు. ప్రజాస్వామ్యబద్ధంగా కొందరు సర్పంచ్ వ్యవహరించాల్సిందిగా సూచించారు. తప్పు చేస్తే నా పని నేను చేయాల్సి వస్తుందని, అభివృద్ధి పనులు చేయడానికి స్వాగతిస్తానని, తన ప్రతిష్టకు భంగం కలిగిస్తానంటే ఊరుకునే ప్రసక్తే లేదని హెచ్చరించారు.

నియోజకవర్గ ఎమ్మెల్యేగా తన వద్ద భేదాభిప్రాయాలు లేవని రాజకీయాలకతీతంగా అందరి పనులు చేస్తానని సూచించారు. సరస్వతి అమ్మవారి ఆశీర్వాదం తనపై ఉందని నా హాయంలో ఆలయపున నిర్మాణం కావడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు. రెండున్నర సంవత్సరాల్లో పార్టీలకు అతీతంగా నాలుగు వేల మందికి ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా చెక్కులను పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో అధికారులు, తాసిల్దార్ శివరాజ్ కాంట్రాక్టర్ ఆర్ అండ్ బి డి ఈ నాయకులు, ఆయా గ్రామాల మాలేగా సర్పంచ్ షేల్ కి ఆనంద్. నా మత్క దిగంబర్. ఏం రమేష్. లక్ష్మణ్. దత్త హరి సర్పంచులు బిజెపి నాయకులు పాల్గొన్నారు.

Leave a Reply