MLA | స్వచ్ఛంద సంస్థ చేయూత

MLA | స్వచ్ఛంద సంస్థ చేయూత

  • బాపట్ల ఏరియా ఆస్ప‌త్రికి వాట‌ర్ హీట‌ర్ల అంద‌జేత
  • కర్లపాలెం మానవత స్వచ్ఛంద సంస్థ సేవ‌లు భేష్ : ఎమ్మెల్యే

MLA | బాపట్ల టౌన్ జనవరి 10 ఆంధ్రప్రభ : బాపట్ల ఏరియా వైద్యశాలలో ప్రసూతి విభాగంలో వేడి నీరు సరఫరా లేక ఇబ్బందులు గురవుతున్నారనే విష‌యం తెలుసుకొని కర్లపాలెం మానవతా స్వచ్ఛంద సంస్థ ముందుకు వచ్చి రెండు వాటర్ హీటర్లను శాసనసభ్యులు వేగేశన నరేంద్ర వర్మ రాజు చేతుల మీదుగా ఏరియా ఆసుపత్రి ఆర్ఎంఓ ఇమ్మడి సుజాతకు అందజేశారు.

ఆసుపత్రిలో చలికాలం ప్రసూతి విభాగంలో వేడి నీరు సరఫరా సదుపాయం లేకపోవడం ఏమిటని ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. నూతన హీటర్లను వెంటనే అమర్చి వేడి నీటి సరఫరా చేయాల‌ని ఆదేశించారు. కర్లపాలెం మానవతా స్వచ్ఛంద సంస్థ సభ్యుడు మాడసాని బాలాజీ ఒక హీటరు, మిగతా సభ్యులు ఒక హీటరు చొప్పున మొత్తం రెండు హీటర్లు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మానవత స్వచ్ఛంద సంస్థకు కృతజ్ఞతలు తెలిపారు.

MLA

మానవతా స్వచ్ఛంద సంస్థ కర్లపాలెం మండల అధ్యక్షులు సుబ్బారావు, కార్యదర్శి మందపాటి పరమానంద కుమార్, బేతాళం నాగరాజు, బాపట్ల స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యులు ప్రముఖ న్యాయవాది కళ్ళం హరినాధ రెడ్డి, బోరుగడ్డ జీవన్, మామిడాల మంగయ్య తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply