Former CM | పార్టీని ప్రణాళిక బద్ధంగా పటిష్ట పరచండి..

Former CM | పార్టీని ప్రణాళిక బద్ధంగా పటిష్ట పరచండి..
- కార్యకర్తలకు భరోసా ఇవ్వండి…
- నంద్యాల ఎమ్మెల్సీకి మాజీ సీఎం సూచన..
Former CM | నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ : నంద్యాల జిల్లాలో పార్టీ కార్యకర్తలకు భరోసా ఇవ్వండి, కేసులకు అదరాల్సిన అవసరం లేదని మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్‌సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నంద్యాల ఎమ్మెల్సీ ఇస్సాకు భాషకు సూచించారు. ఇవాళ మాజీ సీఎం వైయస్ జగన్ ను కలిశారు. ఈ సందర్భంగా ఇసాక్ బాషా మాట్లాడుతూ… గ్రామస్థాయి నుంచి పార్టీ పటిష్టతకు ప్రణాళికను మాజీ ఎమ్మెల్యే శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి ద్వారా కృషి చేస్తున్నామన్నారు.
ప్రతి కార్యకర్తకు అండగా ఉంటామని పేర్కొన్నారు. పీపీపీ విధానంలో మెడికల్ కళాశాలలను ప్రవేట్ పరం చేయడం ప్రస్తుత సీఎం చంద్రబాబుకు తగదని పేర్కొన్నారు. సూపర్ సిక్స్ పథకాల అమలు ఎక్కడ జరిగిందని పేర్కొన్నారు. కోటి సంతకాలకు పైగానే పీపీపీ విధానంపై వ్యతిరేకిస్తూ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో గవర్నర్ కు ఇచ్చామని తెలిపారు. నంద్యాలలో కూడా టీడీపీ పార్టీకి ఎదురుగాలి వీస్తుందని పేర్కొన్నారు. ప్రతి కార్యకర్తకు అండగా ఉండాలని మాజీ సీఎం సూచించినట్లు తెలిపారు. కార్యక్రమంలో హీరోజ్, పలువురు పాల్గొన్నారు.
