Started | సోలార్ విద్యుత్ వినియోగం పెంచాలి

Started | సోలార్ విద్యుత్ వినియోగం పెంచాలి
- గన్నవరం ఎయిర్పోర్ట్లో 33 కెవి విద్యుత్ సబ్ స్టేషన్ ప్రారంభించిన మంత్రి గొట్టిపాటి
Started | గన్నవరం, ఆంధ్రప్రభ : కృష్ణా జిల్లా గన్నవరం ఎయిర్ పోర్ట్ లో 132/33 కె.వి విద్యుత్ ఉపకేంద్రాన్ని మంత్రి గొట్టిపాటి రవికుమార్, చీఫ్ సెక్రటరీ విజయానంద్, ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పాటైన నాటి నుంచి విద్యుత్ సంస్థలు తలెత్తకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. గన్నవరం నియోజకవర్గంలో సోలార్ విద్యుత్ వినియోగాన్నిపెంచాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు మంత్రి సూచించారు.

ప్రజలపై ట్రూ అప్ చార్జీల భారం తగ్గించిన ఘనత సీఎం నారా చంద్రబాబు నాయుడుకు దక్కుతుందని వివరించారు. విద్యుత్ వినియోగం ఎక్కువ అవుతున్న నేపథ్యంలో ఎలాంటి విద్యుత్ సమస్యలు రాష్ట్రంలో తలెత్తకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి వివరించారు. గన్నవరం ఎయిర్పోర్టులో 133/ 33 కెవి విద్యుత్ ఉప కేంద్రాన్ని ప్రారంభించడం ఎంతో సంతోషంగా ఉందని మంత్రి తెలిపారు. రైతులకు అవసరమైన విద్యుత్ ను నిరంతరాయం సరఫరా చేస్తున్నట్లు తెలుపుతూ, ప్రజలు విద్యుత్తును పొదుపుగా వినియోగించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, కూటమి నాయకులు పాల్గొన్నారు.
