MPDO | డాక్టర్ జయసుధకు సన్మానం..

MPDO | డాక్టర్ జయసుధకు సన్మానం..

MPDO, వికారాబాద్, ఆంధ్రప్రభ : వికారాబాద్ జిల్లా పంచాయతీ అధికారి డాక్టర్ పి జయసుధను, వికారాబాద్ జిల్లాలోని ఎంపీడీవోలు మర్యాదపూర్వకంగా కలిసి బొకే అందజేసి సన్మానించారు. ఇటీవల నిర్వహించిన గ్రామపంచాయతీ ఎన్నికలు సజావుగా, సమర్థవంతంగా, శాంతియుతంగా నిర్వహించినందుకు డాక్టర్ పి జయసుధలను వికారాబాద్ జిల్లాలోని ఎంపీడీవోలు సన్మానించారు.

ఈ సందర్భంగా డాక్టర్ పి జయసుధ మాట్లాడుతూ.. అధికారులు, ప్రజా ప్రతినిధులు, మీడియా సహకరించిన కారణంగా ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవోలు, వినయ్ కుమార్, అనురాధ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply