KGF | టాక్సిక్ నయన్ లుక్ అదిరింది..

KGF | టాక్సిక్ నయన్ లుక్ అదిరింది..

KGF | వెబ్ డెస్క్, ఆంధ్ర‌ప్ర‌బ : కేజీఎఫ్ హీరో యశ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ టాక్సిక్. ఈ సినిమాకి గీతూ మోహన్ దాస్ డైరెక్టర్. కేజీఎఫ్‌(KGF) అనే ఒక్క సినిమాతో.. పాన్ ఇండియా రేంజ్ లో సెన్సేషన్ క్రియేట్ చేసి క్రేజ్ సొంతం చేసుకున్నాడు యశ్‌. దీంతో యశ్ నటిస్తున్న టాక్సిక్ మూవీ పై ఎక్స్ పెక్టేషన్స్(Expectations) భారీగా ఉన్నాయి.

ఈ సినిమా ఇప్పటికే రిలీజ్ కావాలి కానీ.. కొన్ని కారణాల వలన ఆలస్యం అయ్యింది. ఇప్పుడు మార్చి 19న భారీ స్థాయిలో థియేటర్స్ లోకి వచ్చేందుకు రెడీ అవుతుంది. ఈ సందర్భంగా ప్రమోషన్స్ లో భాగంగా ఈ మూవీ నుంచి ఒక్కో ఫస్ట్ లుక్ రిలీజ్ చేస్తున్నారు.

ఈ భారీ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీలు కియారా అద్వానీ, హుమా ఖురేషి, సౌత్ బ్యూటీ నయనతార(South Beauty Nayanthara) నటిస్తున్నారు. కియారా అద్వానీ, హుమా ఖురేషి ఫస్ట్ లుక్ పోస్టర్స్ ఇటీవల రిలీజ్ చేశారు. ఈ పోస్టర్స్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు అందాల తార నయనతార ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు.

నయన తారని ఒక స్టన్నింగ్ లుక్ లో ప్రెజెంట్ చేస్తూ.. ఆమె గంగ అనే పాత్రలో నటిస్తున్నట్టుగా రివీల్ చేశారు. ఈ పోస్టర్ కి మంచి రెస్పాన్స్ వస్తుంది. కేవిఎన్ ప్రొడక్షన్స్ సంస్థ ఈ సినిమాని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుంది. మరి.. యశ్ టాక్సిక్ తో కేజీఎఫ్ రేంజ్ సక్సెస్ సాధిస్తాడేమో చూడాలి.